ఉత్తరప్రదేశ్ లోని యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ దీపావళికి గిన్నీస్ రికార్డ్ సాధించేందుకు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా దీపావళి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో శనివారం ఈఅక్టోబర్ 26,2019) రాత్రి యూపీ ప్రభుత్వం గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించనుంది. శ్రీరాముడు జన్నమించిన అతి పవిత్రమైన అయోధ్యా నగరంలో 5.51లక్షల మట్టి ప్రమిదలలో దీపాలు వెలిగించి ‘దీపోత్సవం’ రికార్డుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
లక్షల దీపాలతో అయోధ్య నగరాన్ని అలంకరించాలని సీఎం యోగి నిర్ణయించారు. యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫీజీ రిపబ్లిక్ డిప్యూటీ స్పీకర్ వీణ భట్నాగల్, యూపీ మంత్రులు పాల్గొననున్న అయోధ్య దీపోత్సవంలో శనివారం ఉదయం 10 గంటల నుంచి ఊరేగింపు ప్రారంభమైంది.
సాకేత్ కళాశాల నుంచి రామకథ పార్కు వరకు సాగనున్న ఈ ఊరేగింపులో దేశంలోని నలుమూలల నుంచి కళాకారులు పాల్గొన్నారు. సీతారాములను ఆరాధించడంతో పాటు రాముడి పట్టాభిషేకం సాగనుంది. రామలీలా కార్యక్రమంలో ఏడు దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. 2,500 మంది విద్యార్థులు రాముడి జీవితంలోని ఘట్టాలతో చిత్రాలు గీశారు. ఈ సందర్భంగా రూ.226 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం యోగి ప్రారంభించనున్నారు.
దీపావళి సందర్భంగా శనివారం రాత్రి చేపట్టనున్న దీపోత్సవం గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నిలవనుంది. ఈ అయోధ్య దీపోత్సవాన్ని యూపీ సర్కారు రాష్ట్ర పండగగా ప్రకటించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.అద్భుతంగా కన్నుల పండుగ జరిగే ఈ దీపోత్సవానాకి భక్తులు భారీగా తరలిరానున్నారు. దీని కోసం సీఎం ఆదిత్యానాథ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
2018 లో యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వం సరయు నదీ తీరంలో 3 లక్షల 150 మంటి మట్టి దీపాలను వెలిగించి దీపోత్సవ వేడుకలు చేసిన విషయం తెలిసిందే.
Ayodhya: Arrangements underway at Saryu Ghat for 'deepotsav' that will be held today evening. Over 5.50 lakh earthen lamps will be lit during the event. #Diwali pic.twitter.com/1jZFFm1PJ1
— ANI UP (@ANINewsUP) October 26, 2019