Karnataka Politics: తాను ముఖ్యమంత్రి కాకపోవడానికి గల అసలు కారణాన్ని వెల్లడించిన డీకేశివకుమార్

ఎందుకు డీకే ముఖ్యమంత్రి అవ్వలేదనే చర్చ చాలా రోజుల నుంచే కొనసాగుతోంది. అయితే తాజాగా దీనిపై ఆయనే సమాధానం చెప్పారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేయడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించలేదు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల..

DK Shivakumar: తనను ముఖ్యమంత్రిని చేయడానికి ప్రజలు ఓటేసినప్పటికీ హైకమాండ్ తనను ముఖ్యమంత్రి చేయలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. శనివారం ఆయన ఓ కర్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి కుర్చీపై డీకేశివకుమార్, సిద్ధరామయ్య మధ్య తీవ్ర పోటీ కొనసాగింది. వాస్తవానికి ఇద్దరు నాయకులు చాలాకాలంగానే ముఖ్యంత్రి రేసులో ఉన్నారు. కన్నడ ఎన్నికలను డీకే ఒంటిచేత్తో నడిపించారు. అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి కాలేదు.

NTR : వెకేషన్ నుంచి వచ్చేసిన ఎన్టీఆర్.. దేవర మొదలవుతుందా?

ఎందుకు డీకే ముఖ్యమంత్రి అవ్వలేదనే చర్చ చాలా రోజుల నుంచే కొనసాగుతోంది. అయితే తాజాగా దీనిపై ఆయనే సమాధానం చెప్పారు. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిని చేయడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించలేదు కానీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల సూచన మేరకే తాను ముఖ్యమంత్రి పీఠం నుంచి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. శనివారం రామనగరలో జరిగిన ఒక సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Odisha Train Accident: రైలు ప్రమాద ఘటనలో కీలక విషయాలు వెల్లడించిన రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా

‘‘నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి మీరు పెద్దఎత్తున ఓట్లు వేశారు. కానీ పార్టీ హైకమాండ్ వేరే నిర్ణయం తీసుకుంది. సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాకు సూచనలు చేశారు. వారి సూచనలకు నేను లొంగిపోవాల్సి వచ్చింది. నేను సహనంతో ఉండాలి, ఎదురుచూడాలి. మీరు కోరకున్నా ప్రతీది జరగదని గుర్తు పెట్టుకోవాలి’’ అని డీకే అన్నారు. ముఖ్యమంత్రి కుర్చీపై పోటీ కొనసాగుతున్న సమయంలో తనకు ముఖ్యమంత్రి కుర్చీ మూడుసార్లు చేజారిందని, కానీ తాను సహనంతో ఉండడం వల్ల ఏకంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవే దక్కిందని ఖర్గే చెప్పారు. ఆ మాటలతోనే డీకే కన్విన్స్ అయ్యారు.

ట్రెండింగ్ వార్తలు