DMK Party: విజయ్ కి భయపడుతున్నారా? కాంగ్రెస్ డబుల్ గేమ్‌పై డీఎంకే ఫైర్.. సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్ మాజీ మిత్రపక్షమైన డీఎంకే(DMK Party), రాహుల్ గాంధీ ద్విముఖ వైఖరిని ఎండగడుతూ ప్రశ్నల వర్షం కురిపించింది.
- V Santhosh Kumar
- Published on- October 6, 2026 / 08:03 PM IST
DMK severely criticizes Rahul for displaying a double standard
DMK Party: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, కాక్రోచ్ జనతాపార్టీ వంటి సంఘాలు తీవ్రస్థాయిలో నిరసనలు చేపట్టాయి. SIR ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, మిత్రపక్షాల నేతలు మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు.
Gujarat Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగున్న ట్రక్కును ఢీకొన్న ఎస్‌యూవీ.. ఏడుగురు మృతి!
రాహుల్ గాంధీ వైఖరిపై డీఎంకే తీవ్ర ప్రశ్నలు:
ఇదిలా ఉంటే, కాంగ్రెస్ మాజీ మిత్రపక్షమైన డీఎంకే(DMK Party), రాహుల్ గాంధీ ద్విముఖ వైఖరిని ఎండగడుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. తమిళనాడులో SIR ద్వారా ఓటర్ల పేర్ల తొలగింపు జరుగుతోందన్న ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పష్టమైన సమాధానం చెప్పడం లేదని డీఎంకే నేత శరవణన్ అన్నాదురై ‘ఎక్స్’ వేదికగా నిలదీశారు. SIR అమలు తర్వాత ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఎందుకు సమర్థించడం లేదని ఆయన ప్రశ్నించారు.
పొత్తులు మారి ముదురుతున్న విమర్శల యుద్ధం:
తమిళనాడులో కొత్తగా పొత్తులు మారడంతో కాంగ్రెస్, డీఎంకేల మధ్య తీవ్ర రాజకీయ వివాదం రాజుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే వైపు కాంగ్రెస్ మొగ్గు చూపడంతో, డీఎంకే కాంగ్రెస్‌తో స్నేహానికి స్వస్తి చెప్పి ‘ఇండియా’ కూటమికి దూరంగా ఉంటోంది. రాహుల్ గాంధీ సీఎం విజయ్‌కు భయపడే తమిళనాడు SIR అంశంపై మాట్లాడటం లేదని ఎద్దేవా చేసిన డీఎంకే, కాంగ్రెస్‌లో నిజమైన స్నేహ బంధం లేదని స్పష్టం చేసింది.
