Gujarat Accident: గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగున్న ట్రక్కును ఢీకొన్న ఎస్యూవీ.. ఏడుగురు మృతి!
గుజరాత్(Gujarat Accident) లో మంగళవారం ఉదయం అత్యంత తీవ్రమైన విచారకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Seven killed after SUV rams into parked truck in Bhavnagar Gujarat.
Gujarat Accident: గుజరాత్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం అత్యంత తీవ్రమైన విచారకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భావ్‌నగర్ – సోమనాథ్(Gujarat Accident) జాతీయ రహదారిపై తలజా తాలూకా త్రపాజ్ గ్రామం సమీపంలో వేగంగా వెళ్తున్న ఒక ఎస్యూవీ బొలెరో వాహనం, సర్వీస్ రోడ్డుపై ఆగి ఉన్న ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్థానిక షిప్‌యార్డ్‌లో పనిచేస్తున్న ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఘటన తీవ్రత కారణంగా ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఢీకొట్టిన వేగానికి బొలెరో వాహనం నుజ్జునుజ్జు కావడంతో లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని జిల్లా ఎస్పీ నితేష్ పాండే వెల్లడించారు.
