Leh Airport: “కుక్క.. విమానం ల్యాండ్ అవకుండా ఆపేసింది”

వ్యవహారం పాతదే అయినా ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. ఇటీవలి కాలంలో విమానాలు సాంకేతిక లోపంతో గాల్లోకి ఎగిరిన అనంతరం దగ్గర్లోని ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్ అయిపోతున్నాయి. కానీ, ఇక్కడ అరుదైన విషయం జరిగింది. అసలు ల్యాండ్ అవ్వాల్సిన ప్రదేశంలో కాకుండా ఎయిర్‌పోర్ట్ వరకూ వచ్చి మళ్లీ ఎగిరిపోయింది.

Go First

 

 

Leh Airport: వ్యవహారం పాతదే అయినా ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. ఇటీవలి కాలంలో విమానాలు సాంకేతిక లోపంతో గాల్లోకి ఎగిరిన అనంతరం దగ్గర్లోని ఎయిర్‌పోర్టుల్లో ల్యాండ్ అయిపోతున్నాయి. కానీ, ఇక్కడ అరుదైన విషయం జరిగింది. అసలు ల్యాండ్ అవ్వాల్సిన ప్రదేశంలో కాకుండా ఎయిర్‌పోర్ట్ వరకూ వచ్చి మళ్లీ ఎగిరిపోయింది.

అసలు విషయమేమిటంటే.. జూలై 19న ఢిల్లీకి బయలుదేరిన గో ఫస్ట్ విమానం లేహ్ విమానాశ్రయంలో టేకాఫ్ కావాల్సి ఉంది. సడన్‌గా అదే సమయానికి రన్‌వేపైకి కుక్క వచ్చేసింది. దీంతో ఏవియేషన్ రెగ్యులేటర్ టేకాఫ్ చేయడానికి నిరాకరించడంతో మళ్లీ దిశను మార్చుకుని ఎగిరిపోయిందని DGCA అధికారులు తెలిపారు.

DGCA అధికారులు దీనిని “రొటీన్” సంఘటనగానే పేర్కొన్నారు. అంతకుముందు రోజు, గో ఫస్ట్‌కు సంబంధించిన ముంబై-లేహ్ ఫ్లైట్, శ్రీనగర్-ఢిల్లీ ఫ్లైట్ ఇంజిన్ లలో లోపం కనిపించింది. రెండు విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) గ్రౌండ్ చేసింది.

Read Also: మస్కట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన భారత విమానం

సంఘటనలపై DGCA దర్యాప్తు చేస్తోందని.. రెగ్యులేటర్ క్లియర్ చేసినప్పుడు మాత్రమే వాటిని ప్రయాణానికి సిద్ధం చేస్తామని అధికారి తెలిపారు.