దయచేసి షేర్ చేయొద్దు : దేశ ప్రజలకు CRPF విజ్ఞప్తి

దేశ ప్రజలకు CRPF ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో జవాన్ల మృతదేహాలకు సంబంధించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని CRPF అధికారులు చెప్పారు.

  • Publish Date - February 17, 2019 / 09:52 AM IST

దేశ ప్రజలకు CRPF ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో జవాన్ల మృతదేహాలకు సంబంధించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని CRPF అధికారులు చెప్పారు.

దేశ ప్రజలకు CRPF ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియాలో జవాన్ల మృతదేహాలకు సంబంధించి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని CRPF అధికారులు చెప్పారు. మృతదేహాలకు సంబంధించి నకిలీ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారని.. కొంతమంది తెలియక వాటిని షేర్ చేస్తున్నారని తెలిపారు. దయచేసి అలాంటి ఫేక్ ఫొటోలను షేర్ చేయొద్దని దేశ ప్రజలకు CRPF అధికారులు రిక్వెస్ట్ చేశారు. ఫేక్ ఫొటోలు గుర్తిస్తే webpro@crpf.gov.in వెబ్‌సైట్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

 

పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 49మంది జవాన్లు అమరులయ్యారు. CRPF బలగాలను తరలిస్తున్న సమయంలో ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఆత్మాహుతి దాడితో జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటనలో అమరులైన జవాన్ల ఫొటోలకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. కొందరు వ్యక్తులు నకిలీ ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది వాటిని గుడ్డిగా నమ్మి షేర్ చేస్తున్నారు. ఇలా పెట్టే ఫొటోలలో బతికున్న జవాన్ల ఫొటోలు కూడా ఉన్నాయి. దీంతో వారి కుటుంబాలు ఆందోళనకు గురవుతున్నాయి. ఈ విషయమై జవాన్ల కుటుంబాల నుంచి CRPF అధికారులకు సమాచారం వెళ్లింది. దీంతో వారు దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.