ఈవీఎంల పనితీరుపై సందేహాలు : సురవరం

  • Publish Date - April 14, 2019 / 01:23 PM IST

ఈవీఎంల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బ్యాలెట్‌ పత్రాలతో ఎన్నికలు నిర్వహించడం మంచిదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు. పనిచేయని ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. బ్యాలెట్‌ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం ఓట్లు, వీవీ ప్యాట్‌ స్లిప్‌లకు మధ్య తేడా ఉందన్నారు. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరుపై ఢిల్లీలో చంద్రబాబునాయుడు వివిధ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి హాజరైన సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ అసెంబ్లీ ఈవీఎంల ఓట్లకు, వీవీ ప్యాట్ల స్లిప్‌లకు 200 నుంచి వెయ్యి వరకు తేడా వచ్చాయన్నారు. ఈ నేపథ్యలో వీవీ ప్యాట్ల అన్ని స్లిప్‌లను లెక్కించాలని కోరారు. ఎన్నికల కమిషన్‌పై సడలిన నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే అన్ని వీవీ ప్యాట్లను లెక్కించాలని డిమాండ్‌ చేశారు.