డ్రైనేజీ క్లీనింగ్ చేస్తు ముగ్గురు యువకులు మృతి 

  • Publish Date - May 10, 2019 / 05:27 AM IST

ముంబై : డ్రైనేజీ శుభ్రం చేస్తున్న సమయంలో విషవాయువులు పలువురు ప్రాణాలను తీస్తున్నాయి. డ్రైనేజీలో క్లీన్ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవటంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటువంటి మరోప్రమాదానికి ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర థానేలోని ధోకాలి ప్రాంతంలో శుక్రవారం (మే 10,2019) తెల్లవారుజామున 12:25 గంటలకు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యల్ని చేపట్టారు. అస్వస్థతకు గురైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. 
 

డ్రైనేజీని శుభ్రం చేసేందుకు 8 మంది వ్యక్తులు  మురుగును శుద్ధి చేసే ప్లాంట్‌లోకి దిగారు. 130 క్యూబిక్ మీటర్ల లోతు ఉన్న ఈ ప్లాంట్‌లో విషయవాయులకు  ఊపిరాడక ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా మృతులను అమిత్ ఫుహల్(20), అమన్ బాదల్(21), అజయ్ బంబుక్(24)గా గుర్తించారు. అస్వస్థతకు గురైన వారిని విజేంద్ర హత్వల్, మంజిత్, జస్బీర్ పుహల్,  అజయ్ పుహల్,  రమ్మర్ పుహల్ గా పోలీసులు గుర్తించారు.