Delhi : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇష్టపడే ఆహారం ఏంటో తెలుసా?
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రీసెంట్‌గా పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంలో అసలు ఆమె ఇష్టపడే ఫుడ్ ఏంటనే విషయం బయటకు వచ్చింది.
- Lakshmi 10tv
- Published On : June 21, 2023 / 06:05 PM IST
Delhi
Delhi : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రీసెంట్‌గా తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంలో ఆమె ఎలాంటి ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారనే వార్త బయటకు వచ్చింది.
Samantha : రాష్ట్రపతిని కలిసిన సమంత & సిటాడెల్ టీం.. ద్రౌపది ముర్ము ఎలాంటి సినిమాలు చూస్తారో తెలుసా?
ద్రౌపది ముర్ము చాలా సాత్వికమైన ఆహారం తినడానికి ఇష్టపడతారట. రాష్ట్రపతి భవన్‌లోని వంటగదిలో ఆమెకోసం ప్రత్యేకంగా తయారు చేసే వంటల్లో ఉల్లిపాయ, లేదా వెల్లుల్లి అస్సలు వాడరట.. మాంసాహారం అయితే అస్సలు తినరట. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఓట్స్, పూరీలతో పాటు ఆలూ సబ్జీ, రైస్ చీలా వంటి వంటలను రాష్ట్రపతి రుచి చూస్తారట. ఇక రాష్ట్రపతి సొంత రాష్ట్రమైన ఒడిశా వంటలను ఎక్కువగా తయారు చేస్తారట అక్కడి వంటవాళ్లు.
Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు సురినామ్ దేశ అత్యున్నత పౌర పురస్కారం
ద్రౌపది ముర్ము దాల్మా, సంతులా (కూరగాయలు కలిపి చేసే వంటకం)లను చాలా ఇష్టంగా తింటారట. అప్పుడప్పుడు మాత్రమే తనకు ఇష్టమైన వంటలను తయారు చేయమని ఆమె రిక్వెస్ట్ చేస్తారట. సాత్వికమైన ఆహారం తినడంతో పాటు వినయపూర్వకంగా ఉండే రాష్ట్రపతి ఆహార్యం దేశ ప్రజల మన్ననలు పొందుతోంది. ఇక తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి రాష్ట్రపతి కృతజ్ఞతలు చెప్పారు. జగన్నాథుని ఆలయానికి వెళ్లడంతో పాటు న్యూ ఢిల్లీలోని ఓ ఛారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగులతో ఆమె కొంత సమయం గడిపారు.
