Akal takht express Train : రైల్లో మహిళ తలపై మూత్ర విసర్జన చేసిన టీసీ

రైల్లో మహిళ తలపై టీసీ మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విమానంలో ఇటువంటి ఘటన జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఓ బస్సులో కూడా ఇటువంటిదే జరిగింది. తాజాగా మద్యం సేవించిన టీసీ ఓ మహిళ తలపై మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Akal takht express Train : ఆ మధ్య విమానంలో ఓ ప్రయాణీకుడు తోటి ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన్ చేసిన ఘటన కలకలం రేపింది. ఆ తరువాత కూడా అటువంటి ఘనటనే జరిగింది. అలాగే ఓ బస్సులో కూడా ఇటువంటి ఘటనే జరిగింది. తాజాగా ఓ రైతులో ఏకంగా TC ఓ మహిళపై మూత్ర విసర్జన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అకాల్ తఖ్తత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లోని A1 కోచ్ లో ఆదివారం (మార్చి12,2023) అర్ధరాత్రి రైల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Air India flight : విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన మందుబాబు, ఏం పర్లేదు డ్రెస్ మార్చుకోమన్న సిబ్బంది

అమృత్ సర్-కోల్ కతా మధ్య ప్రయాణించే అకాల్ తఖ్తత్ ఎక్స్ ప్రెస్ లో మద్యం మత్తులో ఉన్న టీసీ రైల్లో ప్రయాణిస్తున్న ఓ వివాహిత తలపై మూత్ర విసర్జన చేశాడు. అమృత్ సర్ కు చెందిన సదరు మహిళ తన భర్త రాజేశ్ కుమార్‌తో కలిసి అమృత్‌సర్ నుంచి కోలకతా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో రైలు సోమవారం లక్నోలోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే బాధితురాలు భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు మున్నా కుమార్ మద్యం మైకంలో మూత్ర విసర్జన చేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

American Airlines: విమానంలో మరోసారి మూత్ర విసర్జన ఘటన.. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

టీసీ చేసిన ఈ పనికి సదరు మహిళ గట్టిగా అరిచింది. దీంతో ఆమె భర్తతో పాటు తోటి ప్రయాణీకులు నిద్ర నుంచి మేలుకున్నారు. జరిగింది తెలుసుకున్నారు. ప్రయాణికులు అందరు కలిసి సదరు టీసీని పట్టుకుని ఛార్‌భాగ్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులకు అప్పగించారు. సదరు టీసీ బీహార్‌కు చెందిన మున్నాకుమార్ గా పోలీసులు గుర్తించారు. మున్నా కుమార్ మద్యం మైకంలో మూత్ర విసర్జన చేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

కాగా ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణీకుడు మద్యం మత్తులో ఓ మహిళపై మూత్ర విసర్జన చేసిన ఘటన సంచలనం కలిగించింది. తరువాతే మరో ఘటన జరిగింది. అంతేకాదు కర్ణాటకలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) నిర్వహిస్తున్న పబ్లిక్ బస్సులో హుబ్లికి సమీపంలోని నాన్-ఏపీ బస్సులో 32 ఏళ్ల మహిళపై తోటి ప్రయాణీకుడు మూత్ర విసర్జన చేశాడు. ఇలా విమానాలు, బస్సుల్లో మూత్ర విసర్జన ఘటనలు జరుగగా అతిపెద్ద రవాణా వ్యవస్థ అయినా రైల్లో కూడా దీనికి అతీతం కాలేదు. ఈ ఘటనలకు మద్యం మత్తే కారణం కావటం గమనించాల్సిన విషయం.

ట్రెండింగ్ వార్తలు