Air India flight : విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన మందుబాబు, ఏం పర్లేదు డ్రెస్ మార్చుకోమన్న సిబ్బంది

గాల్లో రయ్ మంటూ దూసుకుపోతున్న విమానంలో ఓ మందుబాబు ఒళ్లు తెలియని మత్తులో తోటి ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియా ఫ్లయిట్ లో 2022 నవంబర్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఏటంటే తాగుబోతు చేసిన పనికి విమాన సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. పైగా సదరు మహిళా ప్రయాణీకురాలికి ఓ జత బట్టలిచ్చి మార్చుకోండి అని చెప్పేసి చేతులు దులుపుకున్నారు.

Air India flight : విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన మందుబాబు, ఏం పర్లేదు డ్రెస్ మార్చుకోమన్న సిబ్బంది

Drunk man urinates on Women passenger in Air India flight

Air India flight : గాల్లో రయ్ మంటూ దూసుకుపోతున్న విమానంలో ఓ మందుబాబు ఒళ్లు తెలియని మత్తులో తోటి ప్రయాణీకురాలిపై మూత్ర విసర్జన చేశాడు. ఎయిర్ ఇండియా ఫ్లయిట్ లో 2022 నవంబర్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఏటంటే తాగుబోతు చేసిన పనికి విమాన సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. పైగా సదరు మహిళా ప్రయాణీకురాలికి ఓ జత బట్టలిచ్చి మార్చుకోండి అని చెప్పేసి చేతులు దులుపుకున్నారు. సిబ్బంది కనీసం సదరు తాగుబోతును ఏమీ అనలేదు. విమానం ల్యాండ్ అయ్యాక కూడా విమాన సంస్థ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సదరు మందుబాబు విమానం ల్యాండ్‌ అయ్యాక దర్జాగా వెళ్లిపోయాడు.

2022 నవంబరు 26న న్యూయార్క్‌ నుంచి దిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో ఓ వృద్ధురాలు బిజినెస్‌ క్లాసులో ప్రయాణిస్తోంది. విమానం గాల్లో దూసుకుపోతోంది. లైట్లు ఆర్పేశారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు ఆ వృద్ధురాలు కూర్చున్న సీటు వద్దకు వచ్చాడు. బహుశా అది వాష్ రూమ్ అనుకున్నాడో ఏమో మద్యం మత్తులు. ఆమెపై మూత్రవిసర్జన చేశాడు. ఆ తర్వాత కూడా అక్కడి నుంచి కదలకపోవడంతో మరో ప్రయాణికుడు వచ్చి బలవంతంగా అతడిని అక్కడనుంచి పంపించేశారు.

తనకు జరిగిన ఘటన గురించి సదరు మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఓ తాగుబోతు చేసిన చెత్త పని వల్ల నా బట్టలు, బ్యాగు తడిచిపోయాయని తెలిపారు. అది విన్న విమాన సిబ్బంది పెద్దగా స్పందించలేదు.అదేదో సాధారణ విషయంలాగా ఆమెకు ఓ జత బట్టలు, చెప్పులు ఇచ్చి డ్రెస్ ఛేంజ్ చేసుకోండి అని చెప్పి చేతులు దులుపుకున్నారు. అంతేతప్ప ఛండాలమైన పనిచేసిన ఆ ప్రయాణికుడిని ఏమీ అనలేదు. దీంతో విమానం ల్యాండ్‌ అయ్యాకు అతడు దర్జాగా వెళ్లిపోయాడు. ఎయిరిండియా విమాన సిబ్బంది తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన సదరు మహిళ.. విమానం దిగిన తరువాత ఆ సంస్థ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌కు లేఖ రాశారు. ఆమె లేఖ రాయటం వల్ల ఈ ఘటన బయటకొచ్చింది.

తడిచిపోయిన సీట్లో కూర్చోలేనని చెప్పడంతో సిబ్బంది కూర్చునే సీటు నాకు ఇచ్చారని.. ఆ తరువాత ఓ గంటపోయాక మీరు మీ సీట్లోకి వెళ్లిపొమ్మన్నారని వాపోయారు ఆమె. నా సీటుపై స్ప్రే చేసినా దుర్వాసన పోలేదని అటువంటి సీట్లోనే నన్ను కూర్చోమన్నారని అంతేతప్ప బిజినెస్ క్లాసులో సీట్లు ఖాళీగా ఉన్నా నాకు కేటాయించలేదు అంటూ వాపోయారు లేఖలో.

ఈ లేఖ తర్వాత ఎయిరిండియా ఈ ఘటనపై ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు చేసిందని..సదరు ప్రయాణికుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విమానయాన వర్గాలు పేర్కొన్నాయి.సదరు మందుబాబుని నో-ఫ్లై లిస్టులో చేర్చటానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది ఎయిర్ లైన్స్.

సదరు మందుబాబుని నో-ఫ్లై లిస్టులో చేర్చాలని డీజీసీఏ (DGCA)కు సిఫార్సు చేసినట్లు తెలిపాయి. ప్రస్తుతం దీనిపై డీజీసీఏ కమిటీ దర్యాప్తు చేస్తోంది. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎయిరిండియాను ఆదేశించినట్లుగా నేషనల్ మీడియాలు వెల్లడించాయి. జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.