Due to unemployment, youths are not finding brides
Sharad Pawar: దేశంలో నెలకొన్న నిరుద్యోగంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం కారణంగా యువకులకు ఎవరూ పిల్లనివ్వడం లేదనే అర్థంలో ఆయన అన్నారు. చదువులు బాగానే ఉన్నప్పటికీ ఉపాధే కష్టమైందని అన్నారు. యువత విద్యావంతులని, వారికి ఉద్యోగాలు కోరే హక్కు ఉందని పేర్కొన్నారు. గురువారం పూణెలో జరిగిన ఎన్‌సీపీ జన్ జాగరణ్ యాత్ర ప్రారంభించిన పవార్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై మండిపడ్డారు.
Maharashtra: ఉద్ధవ్‌కు కౌంటర్ ఇవ్వడం కోసం బీజేపీ వ్యతిరేకితో చేతులు కలిపిన షిండే
‘‘మహారాష్ట్ర నుంచి పరిశ్రమలు వెళుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడం లేదు. పెరిగిన నిరుద్యోగం యువత భవిష్యత్తుతో ఆటలాడుతోంది. పెళ్లి వయసులో ఉన్న యువకులకు వధువులు దొరకడం లేదు. నిరుద్యోగం కారణంగా యువతకు ఎవరూ పిల్లనివ్వడం లేదు’’ అని పవార్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘సామాజిక సమస్యలు ఏర్పతున్నాయి. సమాజంలో వివిధ వర్గాల మధ్య చీలిక ఏర్పడింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాస్తవ సమస్యల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోంది’’ అని విమర్శించారు.