Dulha-Dulhan : షాక్ తిన్న వధువు, వరుడు..చివరి వరకు వీడియో చూడండి

పంజాబీ కుటుంబంలో వివాహం జరుగుతోంది. బంధుమిత్రులు, ఇతర సభ్యుల నడుమ వివాహం ఘనంగా జరిగింది. అతిథులు అంతా సంతోషంగా ఉన్నారు. వివాహ తంతును ముగించుకుని వధూవరులు బయటకు వస్తున్నారు.

Bride, Groom Left In Shock : సోషల్ మీడియాలో వివాహాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. వధువు, వరుడు, ఇతర కుటుంబసభ్యులు చేసే ఫన్నీ వీడియోలను సోషల్ మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు. ఇవి తెగ ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని నవ్వు పుట్టిస్తుంటే..మరికొన్ని బాధిస్తున్నాయి. నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను తెలియచేస్తున్నారు. తాజాగా ఓ పెళ్లికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. చివరి దాక చూసిన తర్వాత..అయ్యో..అని అనుకోవడం ఖాయం.

Read More : PV Sindhu: అనుమతి లేకుండా సింధు పేరును, ఫొటోను యాడ్స్‌లో వాడిన 15కంపెనీలకు నోటీసులు

పంజాబీ కుటుంబంలో వివాహం జరుగుతోంది. బంధుమిత్రులు, ఇతర సభ్యుల నడుమ వివాహం ఘనంగా జరిగింది. అతిథులు అంతా సంతోషంగా ఉన్నారు. వివాహ తంతును ముగించుకుని వధూవరులు బయటకు వస్తున్నారు. వధువురు ఎర్రటి లెహంగాలో ఉండగా..వరుడు కత్తి పట్టుకుని..తెల్లటి షేర్వానీలో మెరిసిపోతున్నారు. బయటకు వస్తున్న సమయంలో అక్కడున్న బంధువులు, ఇతరులు గులాబీ రేకులు చల్లుతున్నారు.

Read More : Ancient Vessel : 4,600 ఏళ్ల నాటి బోటు.. అతికష్టం మీద మ్యూజియంకి

ఆనందంగా నవ్వుకుంటూ వస్తున్న వరుడు, వధువు ఒక్కసారి..ఓ నో..ఓ..నో (Oh No, Oh No)..అంటూ నోరెళ్లబెట్టారు. అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. wishnwed పేరిట ఇన్ స్ట్రా గ్రామ్ లో పోస్టు చేశారు. వీడియో కూడా మెల్లిగా కదిలింది. స్విమ్మింగ్ పూల్ లో పడిన ఓ కెమెరామెన్ ను మరోక వ్యక్తి లేపుతున్నారు. ఫొటో తీస్తూ..ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడు. చివరి వరకు వీడియో చూడండి అంటూ పోస్టులో వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు