Ancient Vessel : 4,600 ఏళ్ల నాటి బోటు.. అతికష్టం మీద మ్యూజియంకి

సుదీర్ఘకాలంగా ఈజిప్ట్ లోని గిజా పిరమిడ్‌ల పక్కన ఉంటున్న ఒకప్పటి ఈజిప్ట్ రాజు "కుఫు"వాడిన పురాతన మరియు అతి పెద్ద చెక్క పడవని అతికష్టంమీద సమీపంలోని పెద్ద మ్యూజియానికి తరలించబడిందని శనివారం ఈజిప్ట్ అధికారులు తెలిపారు.

Ancient Vessel : 4,600 ఏళ్ల నాటి బోటు.. అతికష్టం మీద మ్యూజియంకి

Boat

Ancient Vessel సుదీర్ఘకాలంగా ఈజిప్ట్ లోని గిజా పిరమిడ్‌ల పక్కన ఉంటున్న ఒకప్పటి ఈజిప్ట్ రాజు “కుఫు”వాడిన పురాతన మరియు అతి పెద్ద చెక్క పడవని అతికష్టంమీద సమీపంలోని పెద్ద మ్యూజియానికి తరలించబడిందని శనివారం ఈజిప్ట్ అధికారులు తెలిపారు. కాగా,గ్రేట్ పిరమిడ్ వద్ద 1954 లో కనుగొనబడిన ఈ పురాతన నౌక.. గిజా పీఠభూమి వద్ద ఉన్న మ్యూజియంలో దశాబ్దాలుగా ప్రదర్శించబడింది.

సోలార్ బోట్ అని కూడా పిలువబడే 4,600 సంవత్సరాల పురాతనమై ఈ నౌకని.. ఈ ఏడాది చివర్లో ప్రారంభోత్సవం జరగనున్న సమీపంలోని గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం (GEM) కి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్న రిమోట్-కంట్రోల్డ్ వాహనంపై తరలించబడినట్లు ఈజిప్ట్ పర్యాటక మరియు పురాతన మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. 42 మీటర్ల (138 అడుగులు) పొడవు మరియు 20 టన్నుల బరువు కలిగిన సెడార్‌వుడ్ పడవను మ్యూజియంకి తీసుకెళ్లడానికి 48 గంటలు పట్టిందని తెలిపారు. శనివారం వేకువజామున EGMకి చేరుకుందని ప్రకటనలో తెలిపింది.

భవిష్యత్ తరాల కోసం.. మానవజాతి చరిత్రలో చెక్కతో చేసిన అతి పెద్ద మరియు పురాతన సేంద్రీయ కళాఖండాన్ని రక్షించడం మరియు సంరక్షించడమే రవాణా ప్రాజెక్ట్(మ్యూజియంకి తరలించడం) లక్ష్యం అని ప్రకటనలో తెలిపింది.