పసిపిల్లాడ్ని ఎత్తుకుని సీఎం సెక్యూరిటీకి వచ్చిన మహిళా పోలీస్

  • Publish Date - March 3, 2020 / 11:04 AM IST

యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ సెక్యూరిటీ విధుల్లో  ఓ మహిళా కానిస్టేబుల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సంవత్సరంన్నర వయస్సు ఉన్న కొడుకుని ఎత్తుకునే సీఎం సెక్యూరిటీ విధుల్ని నిర్వహించారు కానిస్టేబుల్  ప్రీతీరాణి. ఓ పక్క డ్యూటీ..మరోపక్క కొడుకు బుజాన ఎత్తుకుని బాధ్యతలను సమన్వయంతో నిర్వహించని ప్రీతీరాణి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఉద్యోగం చేసే మహిళలకు డ్యూటీ ఎంత ముఖ్యమో ఇంటి బాధ్యతలు అంతకంటే ముఖ్యం. ఉద్యోగిగా తమ బాధ్యల్ని ఎంత అంకిత భావంతో నిర్వహిస్తారో..మరోవైపు తల్లిగా..భార్యగా..అత్తమామలకు కోడలిగా..కూతురిగా..ఇల్లాలిగా ఇంటి బాధ్యతలు  ఇలా ఎన్నింటినో సమర్థతతో..సమన్వయంతో నిర్వహించే మహిళల సమయస్ఫూర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే ఉద్యోగాలు చేసే మహిళల శక్తి యుక్తులు…రెండు చేతులతోనే అన్ని బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించే మహిళను అర్థంచేసుకోవటం ఎవ్వరి తరం కాదు. అలా కొడుకుని ఎత్తుకునే ప్రీతీసింగ్ సీఎం ఆదిత్యానాథ్ గౌతమ్ బుద్ధ్ లో పర్యటనలో కనిపించారు. 

వివారాల్లోకి వెళితే..సీఎం యోగీ ఆదిత్యానాథ్ ఆదివారం నుంచి రెండు రోజుల పాటు గౌతమ్ బుద్ధ నగర్ లో పర్యటించారు. 1452 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయటానికి సీఎం సోమవారం నోడియా నగరానికి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా గ్రేటర్ నోయిడాలోని దాద్రి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించే 20 సంవత్సరాల  ప్రీతీ రాణి సీఎం సెక్యూరిటీలో భాగంగా ఉన్నారు. సీఎం తిరిగి వెళ్ళేంత వరకూ ఆయుధాలతో వేయి కళ్లతో కావాలికాయాల్సిన వీవీఐపీ బాధ్యతల్లో ఉన్నారు ప్రీతీరాణి. 

ఈక్రమంలో ప్రీతిరాణి తన ఏడాదిన్నర వయస్సున్న కొడుకుని తనతో పాటు ఉంచుకోవాల్సిన వచ్చింది. తన కొడుకుని చూసుకునే తన భర్తకు ఆరోజు ఏదో ఎగ్జామ్ కు హాజరవ్వటంతో కొడుకుని చూసుకునేవారు ఎవ్వరూ లేకపోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకుని భుజాన ఎత్తుకునే డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఈ  డ్యూటీలో తన కొడుకును భుజాన వేసుకునే అత్యంత సమర్థవంతంగా డ్యూటీని నిర్వహించారు కానిస్టేబుల్ ప్రీతీరాణి. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.