Earthquake in Delhi: ఢిల్లీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదు
ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భూమి కంపించింది. 30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
- Harishth Thanniru
- Published On : January 24, 2023 / 03:11 PM IST
delhi earthquake
Earthquake in Delhi: దేశంలో అక్కడక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఢిల్లీ – ఎన్సీఆర్, ఉత్తర, తూర్పు భారతదేశంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) ప్రాథమిక సమాచారం ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైంది. భూకంప కేంద్రం నేపాల్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
अभी अभी भूकंप आया किस किस को फील हुआ ? #earthquake pic.twitter.com/Ohke2DFMnV
— Akanksha Tripathi (@Akanksha97t) January 24, 2023
30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పలు ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే, ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిసింది.
