Soumya Chaurasia: ఛత్తీస్‌గఢ్ సీఎం డిప్యూటీ సెక్రెటరీని అరెస్ట్ చేసిన ఈడీ

చౌరాసియాను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి 4 రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ విచారణకు తమకు 14 రోజుల కస్టడీ కావాలని ఈడీ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 4 రోజుల విచారణ అనంతరం ఆమెను డిసెంబర్ 6న కోర్టు ముందు హాజరు పరచనున్నారు. గత రెండు నెలల్లో సౌమ్యను కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుమార్లు ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి

Soumya Chaurasia: బొగ్గు కుంభకోణం కేసులో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. అక్రమ మైనింగ్ కేసులో చౌరాసియా కేంద్ర ఏజెన్సీల రాడార్‌లో ఉన్నారు. ఈడీకి ముందు ఆదాయపు పన్ను శాఖ ఆమె నివాసంలో కార్యాలయంలో సోదాలు చేసి, కొన్ని వివరాలు సేకరించింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆదాయపు పన్ను శాఖ సేకరించిన వివరాలను ఆధారం చేసుకుని ఈడీ దాడులు చేసింది.

Vasantha Mulasavalagi: ముస్లింలకు నిజంగా ధ్వేషమే ఉంటే ఒక్క హిందువు మిగిలేవారు కాదట!.. వివాదాస్పదమవుతున్న రిటైర్డ్ జడ్జి వ్యాఖ్యలు

చౌరాసియాను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఈడీకి 4 రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ విచారణకు తమకు 14 రోజుల కస్టడీ కావాలని ఈడీ కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 4 రోజుల విచారణ అనంతరం ఆమెను డిసెంబర్ 6న కోర్టు ముందు హాజరు పరచనున్నారు. గత రెండు నెలల్లో సౌమ్యను కేంద్ర దర్యాప్తు సంస్థలు పలుమార్లు ప్రశ్నించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఛత్తీస్‌గఢ్‌లో కార్టెల్ ద్వారా రవాణా చేసే బొగ్గుపై ప్రతి టన్నుకు 25 రూపాయల చొప్పున అక్రమంగా వసూలు చేసిన స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ నిరోధక చట్టం-2002 కింద చౌరాసియాను ఈడీ అరెస్ట్ చేసింది. ఇందులో చౌరాసియాతో పాటు సీనియర్ బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు, ఇతర మధ్యవర్తులు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.

Delhi-Kanpur train: రైలులో ఇనుపరాడ్డు రూపంలో దూసుకొచ్చి యువకుడిని కబళించిన మృత్యువు

ట్రెండింగ్ వార్తలు