Sanjay Raut : సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్న ఈడీ!

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుంచి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు.. విచారణ కోసం రౌత్​ను అదుపులోకి తీసుకున్నట్లు సాయంత్రం ప్రకటించారు.

Sanjay Raut: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన ఘటన చోటు చేసుకుంది. శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ను ED (Enforcement Directorate) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ కార్యాలయంకు ఆయన్ను తరలిస్తారని తెలుస్తోంది. ఆదివారం ఉదయం 7గంటల నుంచి సంజయ్ రౌత్ మైత్రి నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే విచారణ నిమిత్తం సంజయ్ రౌత్ ను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు.

MP Sanjay Raut : శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌కు మరోసారి ఈడీ సమన్లు

పాత్రచాల్ కుంభకోణంతో ఆయన సతీమణి వర్షా రౌత్ సహా మరికొంత మంది సన్నిహితులకు సంబంధం ఉందన్నది ఈడీ ప్రధాన ఆరోపణ. ఈ కుంభకోణం కేసుకు సంబంధించి సంజయ్ రౌత్ ను జూలై 1న ఈడీ అధికారులు సుమారు 10గంటల పాటు విచారించారు. తరువాత రెండు సార్లు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సమన్లను జారీ చేసినప్పటికీ వాటిని సంజయ్ దాటవేయడంతో ఆదివారం 12 మంది ఈడీ అధికారులు ముంబైలోని నివాసంలో సోదాలు నిర్వహించారు.

Commonwealth Games 2022: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తాచాటిన 19ఏళ్ల జెరెమీ

లాండర్డ్ డబ్బుతో అతని భార్య వర్షా రౌత్ కొనుగోలు చేసిన దాదర్ ప్లాట్ పై తదుపరి దాడులు జరిగాయి. దాదాపు తొమ్మిది గంటల పాటు ఈడీ విచారణ అనంతరం శివసేన ఎంపీ తన నివాసం నుంచి వెళ్లిపోయారు. అతని అరెస్టు పై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. సంజయ్ రౌత్ ను ఈడీ కార్యాలయానికి అధికారులు తరలించారు. సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకున్నేన పథ్యంలో ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు తనను తీసుకెళ్లే సమయంలో ఇంటి వద్దకు వచ్చిన శివసేన కార్యకర్తల వైపు చూసి రౌత్ అభివాదం చేశారు.

ట్రెండింగ్ వార్తలు