ED Sonia Gandhi : 23న రండి.. సోనియా గాంధీకి మరోసారి ఈడీ సమన్లు
సోనియా గాంధీకి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
- Naveen
- Published On : June 11, 2022 / 12:21 AM IST
Ed Sonia Gandhi
ED Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా శుక్రవారం మరోమారు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ అధికారులు సోనియాను ఆదేశించారు. వాస్తవానికి ఈ నెల 8న సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా తాను విచారణకు హాజరు కాలేనని సోనియా దర్యాప్తు సంస్థకు తెలియజేసిన సంగతి తెలిసిందే.
Congress: దాచి పెట్టడానికి ఏమీలేదు.. ఈడీ విచారణకు సోనియా, రాహుల్ హాజరవుతారు: కాంగ్రెస్
కరోనా సోకిన నేపథ్యంలో డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నానని చెప్పిన సోనియా… కరోనా నుంచి కోలుకునేందుకు తనకు కనీసం 3 వారాల సమయం పడుతుందని, అప్పటిదాకా విచారణకు హాజరు కాలేనని తెలిపారు.
Sonia Gandhi: ప్రజాస్వామ్యానికి ఫేస్ బుక్ ప్రమాదకరం – సోనియా గాంధీ
తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మూడు వారాల సమయం ఇవ్వాలని కోరారు. సోనియా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఈడీ అధికారులు… తాజా నోటీసులు జారీ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాతో పాటు రాహుల్ గాంధీకి కూడా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
