Congress: దాచి పెట్ట‌డానికి ఏమీలేదు.. ఈడీ విచార‌ణ‌కు సోనియా, రాహుల్ హాజ‌ర‌వుతారు: కాంగ్రెస్‌

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందు విచార‌ణ‌కు హాజ‌రవుతార‌ని ఆ పార్టీ స్ప‌ష్టం చేసింది.

Congress: దాచి పెట్ట‌డానికి ఏమీలేదు.. ఈడీ విచార‌ణ‌కు సోనియా, రాహుల్ హాజ‌ర‌వుతారు: కాంగ్రెస్‌

Sonia Rahul

Congress: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ముందు విచార‌ణ‌కు హాజ‌రవుతార‌ని ఆ పార్టీ స్ప‌ష్టం చేసింది. నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు ఈడీ స‌మ‌న్లు పంపిన విష‌యం తెలిసిందే. సోనియా బుధ‌వారం ఈడీ ముందు హాజ‌రుకావాల్సి ఉండ‌గా, క‌రోనాకు చికిత్స తీసుకుంటోన్న నేప‌థ్యంలో ఆమె విచార‌ణ‌కు వెళ్ల‌లేదు. విచార‌ణ‌కు హాజ‌ర‌య్యేందుకు కొంత స‌మ‌యం ఇవ్వాల‌ని ఈడీని సోనియా గాంధీ అడిగార‌ని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

Bihar: బిహార్‌లో నిర్భ‌య త‌ర‌హా ఘ‌ట‌న‌.. బ‌స్సులో బాలిక‌పై గ్యాంగ్ రేప్

కాంగ్రెస్ నేత ప‌వ‌న్ ఖేరా బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ… ”మాది చ‌ట్టానికి క‌ట్టుబ‌డి ఉండే పార్టీ. మేము అన్ని నిబంధ‌న‌ల‌నూ పాటిస్తాం. ద‌ర్యాప్తు సంస్థ‌లు స‌మ‌న్లు జారీ చేస్తే సోనియా, రాహుల్ తప్ప‌కుండా వెళ్తారు. మా వ‌ద్ద దాచిపెట్ట‌డానికి ఏమీ లేదు. మేము బీజేపీ నేత‌ల్లా కాదు. అమిత్ షా 2002-2013 మ‌ధ్య ఎలా వ్య‌వ‌హ‌రించారో అంద‌రికీ తెలుసు. బీజేపీ నేత‌లు మ‌మ్మ‌ల్ని చూసి నేర్చుకుంటారు” అని ఆయ‌న చెప్పారు. కాగా, న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ నిరోధ‌క చ‌ట్టం (పీఎంఎల్ఏ) కింద‌ రాహుల్ గాంధీని ఈడీ ఈ నెల 13న‌ విచారించనుంది.