Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఈడీ మరోసారి సమన్లు

మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వాంగ్మూలం ఇచ్చేందుకు జార్ఖాండ్ రాజధాని రాంచీలో వచ్చే వారం అందుబాటులో ఉండాలని హేమంత్ సోరెన్‌కు పంపిన తాజా సమన్లలో ఈడీ కోరింది

Enforcement Directorate: భూముల కుంభకోణం కేసులో జార్ఖాండ్ ముఖ్యమంత్రి, జార్ఘాండ్ ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ సోమవారం సమన్లు పంపింది. ఆగస్టు 14న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. దీనికి ముందు అక్రమ మైనింగ్ కేసులో 2022 నవంబర్ 18న సోరెన్‌ను ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ పిలిచింది.

Pledge: అశోక ధర్మచక్రం ప్రబోధించే విలువలపై విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ

మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద వాంగ్మూలం ఇచ్చేందుకు జార్ఖాండ్ రాజధాని రాంచీలో వచ్చే వారం అందుబాటులో ఉండాలని హేమంత్ సోరెన్‌కు పంపిన తాజా సమన్లలో ఈడీ కోరింది. అక్రమ మైనింగ్ కేసులో సోరెన్‌ను గతంలోనూ ఈడీ ప్రశ్నించింది. అయితే, హేమంత్ సోరెన్ విపక్ష కూటమి ఇండియాలో భాగస్వామిగా ఉన్నారు.