బీజేపీ నేతలూ చెప్పండి : మహారాష్ట్రలో లేనిది మధ్యప్రదేశ్ లో ఎందుకు

  • Publish Date - November 8, 2019 / 07:58 AM IST

మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్  ప్రభుత్వం మధ్యాహ్నం భోజనంలో పిల్లలకు గుడ్లు పెట్టాలని నిర్ణయించింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ నేతలు వ్యతిరేకిస్తు..విమర్శలు  ప్రారంభించారు. దీంతో గుడ్ల పథకం వివాదంగా మారింది. 

కోడిగుడ్ల విషయంలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మధ్యాహ్న భోజన పథకంలో పిల్లలకు కోడిగుడ్డు ఇవ్వొద్దని మధ్యప్రదేశ్‌ బీజేపీ నేతలు ప్రభుత్వానికి తెలిపటంతో పాటు కొంతమంది నేతలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు గుడ్లు..చికెన్..మటన్ పెడితే వారు పెద్దయ్యాక నరమాంస భక్షకులు గా మారే అవకాశమందని ఓ బీజేపీ నేత ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
  
ఈ అంశంపై మధ్యప్రదేశ్‌ మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి ఇమార్తి దేవీ స్పందిస్తూ..ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్భవించిన మహారాష్ట్రలో విద్యార్థులకు కోడిగుడ్లు పంపిణీ చేస్తే లేని ఇబ్బంది.. మధ్యప్రదేశ్‌లో విద్యార్థులకు కోడిగుడ్లు ఇస్తే తప్పేంటని ఆమె శ్నించారు. 
2016-17 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు కోడిగుడ్లు ఇస్తున్నామని మహారాష్ట్ర అధికారులు చెప్పారని మంత్రి ఈ సందర్బంగా గుర్తు చేశారు. పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారంపై బీజేపీ రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు.  కోడిగుడ్లు తినడం వల్ల విద్యార్థులకు మంచి పోషకాహారం లభిస్తుందన్న డాక్టర్ల సూచన మేరకే స్కూళ్లలో  కోడిగుడ్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.