రాజస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఎనిమిది మంది మృతి

  • Publish Date - September 23, 2019 / 03:53 AM IST

రోడ్డు ప్రమాదం జరగని రోజంటూ లేదు. మితిమీరిన వేగం…డ్రంక్ అండ్ డ్రైవర్..ర్యాష్ డ్రైవింగ్ కారణం ఏదైన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ అజ్మీర్ నగర సమీపంలో లామనా గ్రామం సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ- బస్సు ఢీకొనటంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయాలపాలయ్యారు. 

ఆదివారం (సెప్టెంబర్ 22)న జైపూర్ నుంచి గుజరాత్ వెళ్తున్న బస్సు 85మందితో అజ్మీర్-బేవార్ నేషనల్ హైవేపై ప్రయాణిస్తోంది. ఆ బస్సుకు ఎదురుగా అతి వేగంగా వస్తున్న లారీ-బస్సును ఢీకొంది. ఈ  ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించగా..మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమాచారాన్ని అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహయక చర్యల్ని చేపట్టారు.  గాయపడిన వారిని వెంటనే అజ్మీర్, బేవార్ నగరాల్లోని అమృత్ కౌర్ ప్రభుత్వ, జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రికి తరలించారు. 

కాగా బస్సులో ఉన్నవారిలో ఎక్కువ మంది రోజువారీ కూలీలని గుజరాత్ లోని పాలన్పూర్ కు ఉపాధి కోసం వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. స్వల్ప గాయాలతో బైటపడ్డ ఓ రైతు కూలీ లారీ డ్రైవర్ పై విరుచుకుపడ్డారు. ఇష్టమొచ్చినట్లుగా డ్రైవింగ్ చేస్తు పేదల ప్రాణాలు తీశాంటూ ఆవేదన వ్యక్తంచేశాడు.  కాగా గాయపడివారికి తగిన చికిత్సనందిస్తున్నామనీ జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ జైన్ తెలిపారు.