ఎలక్షన్ ఎలర్ట్ : కశ్మీర్‌లో రోడ్ షో‌లపై నిషేధం

  • Publish Date - March 28, 2019 / 05:42 AM IST

శ్రీనగర్ : దేశ వ్యాప్తంగా జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉగ్రదాడులు జరుగే అవకాశాలున్నాయని ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో జమ్ము కశ్మీర్ లో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంట్లో భాగంగా ఎన్నికల వేళ జమ్ము కశ్మీర్ లో పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్నాయి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం నేతలెవరు రోడ్ షోలను నిర్వహించకూడదని ఉన్నతాధికారులు హెచ్చరించారు. 
 

రాజకీయ పార్టీలు ప్రచారానికి ర్యాలీలు జరపాలంటే ముందస్తుగా జిల్లాల అధికారులు..పోలీసులతో ముందస్తు అనుమతులు తీసుకోవాలని..భద్రతా చర్యలను సమీక్షించిన తర్వాతే తాము ర్యాలీలకు అనుమతి ఇస్తామని కశ్మీర్ పోలీసులు స్పష్టంచేశారు.  రాజకీయ నాయకులకు ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు ఉన్న క్రమంలో నేతల భద్రతకు బలగాలను నియమించామని పోలీసులు తెలిపారు. ఎన్నికల ప్రచారాన్ని టార్గెట్ చేసేందుకు కొంతమంది ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే ఇంటలిజెన్స్ అధికారుల హెచ్చరించిన క్రమంలో జమ్మూకశ్మీర్ పోలీసులు సాయుధ పోలీసు పహరాను కొనసాగిస్తున్నారు. 

ట్రెండింగ్ వార్తలు