ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ డీజీపీ ట్రాన్సఫర్

పశ్చిమబెంగాల్ డీజీపీ వీరేంద్ర (ఐపీఎస్) ను ఎలక్షన్ కమిషన్ ట్రాన్సఫర్ చేసింది. మార్చి 27నుంచి అసెంబ్లీ3 ఎన్నికలు మొదలుకానుండగా ఐపీఎస్ పీ నిరంజనయన్ ను అపాయింట్ చేసింది. బెంగాల్ ఛీఫ్ సెక్రటరీకి ఎలక్షన్ కమిషన్ రాసిన లెటర్లో..

West Bengal ELECTIONS: పశ్చిమబెంగాల్ డీజీపీ వీరేంద్ర (ఐపీఎస్) ను ఎలక్షన్ కమిషన్ ట్రాన్సఫర్ చేసింది. మార్చి 27నుంచి అసెంబ్లీ3 ఎన్నికలు మొదలుకానుండగా ఐపీఎస్ పీ నిరంజనయన్ ను అపాయింట్ చేసింది. బెంగాల్ ఛీఫ్ సెక్రటరీకి ఎలక్షన్ కమిషన్ రాసిన లెటర్లో ‘పీ నిరంజనయన్ ఐపీఎస్ ను డైరక్టర్ జనరల్ & ఐజీపీ గా వీరేంద్ర స్థానంలో అపాయింట్ చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

అదే సమయంలో వీరేంద్ర ఐపీఎస్ కు ప్రత్యేక్షంగా లేదా పరోక్షంగా ఎన్నికలకు సంబంధించిన ఎటువంటి పదవి ఇవ్వడానికి వీల్లేదు. కమిషన్ ఇచ్చిన ఆదేశం వెంటనే అమల్లోకి రావలంటూ అందులో కన్ఫామ్ చేశారు.

అధికార పార్టీకి వీరేంద్ర అనుకూలంగా ఉంటున్నారంటూ ఎలక్షన్ కమిషన్ పై అనేక రాజకీయ పార్టీలు పలు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ఏడీజీ (లా అండ్ ఆర్డర్) జావేద్ షమీమ్ ను తొలగించి అతని స్థానంలో జగ్మోహన్ ను అపాయింట్ చేసింది.

వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నిక 8దశల్లో జరగనుంది. 294అసెంబ్లీ స్థానంల్లో షెడ్యూల్ కాస్ట్ కు 68, షెడ్యూల్ ట్రైబ్స్ 16గా కేటాయించారు. మొత్తం 1.1లక్ష పోలింగ్ బూత్ లు ఉన్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు