Congress President: అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక అక్టోబర్ 17న నిర్వహించాలని, లెక్కింపు 20న కానుందన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్ 20 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ.. రాహుల్ సహా గాంధీ కుటుంబ సభ్యులెవరూ అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందుకు రాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది.

Congress to hold mass protest rally

Congress President: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక అక్టోబర్ 17న నిర్వహించాలని, లెక్కింపు 20న కానుందన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. వాస్తవానికి సెప్టెంబర్ 20 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలని కాంగ్రెస్ పార్టీ భావించినప్పటికీ.. రాహుల్ సహా గాంధీ కుటుంబ సభ్యులెవరూ అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందుకు రాకపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దీంతో ముందస్తు ప్రక్రియ వాయిదా పడింది. అయితే తదుపరి ఎన్నికతో పాటు ఇతర అంశాల గురించి చర్చించేందుకు ఆగస్టు 28(ఆదివారం) పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవి ఎన్నికకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. సుదీర్ఘ సమయం అనంతరం గాంధీ కుటుంబానికి ఆవలి వ్యక్తి కాంగ్రెస్ అధినేత కాబోతున్నారనే వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజస్తాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు అయిన అశోక్ గెహ్లోత్‭ను పార్టీ అధ్యక్షుడు చేయడానికి గాంధీ కుటుంబం సముఖంగా ఉందని చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఆయన బుధవారం స్పందిస్తూ.. వాస్తవానికి తనతో సోనియా గాంధీ ఇలాంటి విషయాలేవీ మాట్లాడలేదని, మీడియా ద్వారా వింటున్నట్లు తెలిపారు.

10 facts about Gehlot: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడని ప్రచారం జరుగుతున్న గెహ్లోత్ గురించి కీలక విషయాలు