మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోనూ ప్రజలు బీజేపీకే పట్టం గట్టడంతో ఆ పార్టీ మంచి జోష్ మీద కనిపిస్తోంది. అక్టోబరు 21న జరిగిన ఎన్నికల ఫలితాలు అక్టోబరు 24 గురువారం వెల్లడించడంతో బీజేపీ చక్కటి ఆధిక్యంతో గెలుపొందింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాలతో దీపావళికి ముందుగానే ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించారని అన్నారు.
ఈ విజయే ఆ రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పనితీరుకు నిదర్శనంగా పోల్చి చెప్పారు. విజయం తర్వాత బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో సెలబ్రేషన్స్ ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్నమోడీ.. ప్రస్తుత కాలంలో వరుసగా రెండోసారి గెలవడం చాలా కష్టమని.. కొన్ని పార్టీలు మాత్రమే ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలుస్తాయని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో మహారాష్ట్ర, హర్యానాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు.
మంత్రులుగా పనిచేసిన అనుభవం లేకున్నా ఫడ్నవీస్, ఖట్టర్ సుపరిపాలన అందించారని పొగిడారు. హర్యానాలో బీజేపీ ఓటు శాతం 33 నుంచి 36 శాతానికి పెరిగిందన్నారు. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కలిసి ఐదేళ్లపాటు స్థిరమైన పాలన అందించాయన్న సంగతి గుర్తు చేశారు. 50 ఏళ్ల తర్వాత మొదటిసారి మహారాష్ట్రలో ఫడ్నవీస్ పదవీకాలంలో పూర్తిగా సీఎం ఉండగలిగారని.. రెండోసారి కూడా ముఖ్యమంత్రి కానున్నట్లు మోడీ వెల్లడించారు.