Elon Musk Net Worth : ఎలాన్ మస్క్ సంపదతో ఏపీని 30ఏళ్లు, తెలంగాణను 33ఏళ్లు నడపొచ్చు.. భారతీయ రైల్వేను? ఆశ్చర్యకర లెక్కలు..

Elon Musk Net Worth : ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద ప్రపంచంలోని కొన్ని ప్రధాన దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థలను (జీడీపీ) సైతం అధిగమించింది. అంతర్జాతీయ దవ్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా అంచనాలతో మస్క్ సంపదను పోల్చిచూస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

Elon Musk Net Worth

Elon Musk Net Worth in Rupees : ఎలాన్ మస్క్.. ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. అంతేకాదు.. ప్రపంచం ఎప్పటికీ ఈ పేరును గుర్తుంచుకుంటుంది. శుక్రవారం నాస్‌డాక్‌లో స్పేస్‌ఎక్స్ షేరు 150 డాలర్ల వద్ద లిస్ట్ అయింది. స్పేస్‌ఎక్స్ షేర్ల నమోదుతో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌ డాలర్లకుపైగా (సుమారు రూ.103 లక్షల కోట్లు) ఎలాన్ మస్క్ అవతరించాడు. ప్రపంచ కుబేరుల జాబితా చూస్తే మస్క్ దరిదాపుల్లో మరెవరూ లేకపోవడం విశేషం.

Also Read : Indian Railways : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కొత్త IRCTC వెబ్‌సైట్ రెడీ.. ఆ ఇబ్బందులకు ఇక స్వస్తి..

ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద ప్రపంచంలోని కొన్ని ప్రధాన దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థలను (జీడీపీ) సైతం అధిగమించింది. అంతర్జాతీయ దవ్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా అంచనాలతో మస్క్ సంపదను పోల్చిచూస్తే ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కొన్ని సంపన్న దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థల పరిమాణంతో ఎలాన్ మస్క్ ఒంటరిగా పోటీ పడుతున్నారు. ఒక వ్యక్తి ఆస్తులు ఏకంగా ఒక సార్వభౌమ దేశ ఆర్థిక వ్యవస్థను దాటిపోవడం ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది మొదటిసారి.

మస్క్ సంపదతో ఏమేం చేయొచ్చో తెలుసా?
♦ ఎలాన్ మస్క్ 100 లక్షల కోట్లతో భూమి నుంచి చంద్రుడి మీదకు 200సార్లు వెళ్లి రావొచ్చు.
♦ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి 122 డాలర్లు ఇవ్వొచ్చు.
♦ రోజుకు 9.5 కోట్లు ఖర్చు పెట్టినా మొత్తం ఖర్చవ్వడానికి 100ఏళ్లు పడుతుంది.
♦ ఇండియా రక్షణ బడ్జెట్ 7 లక్షల కోట్లు. 100లక్షల కోట్లతో 14 ఏళ్లు రక్షణ శాఖను నడపొచ్చు.
♦ భారత రైల్వే బడ్జెట్ రూ2.75 లక్షల కోట్లు. మస్క్ ఆస్తులతో 35ఏళ్లు భారతీయ రైల్వేస్‌ను నడపొచ్చు.
♦ ఏపీ బడ్జెట్ రూ.3.2 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లు. 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు ఏపీని నడపొచ్చు.
♦ తెలంగాణ బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు. సుమారు 33ఏళ్లకు‌పైగా ప్రభుత్వాన్ని నడపొచ్చు.
♦ ఒక ఎయిమ్స్ నిర్మాణం ఖర్చు రూ.2500కోట్లు. సుమారు 4000 ఎయిమ్స్ ఆస్పత్రులు నిర్మించవచ్చు.
♦ ఒక హైదరాబాద్ మెట్రో ఖర్చు సుమారు రూ.25000 కోట్లు. సుమారు 400 మెట్రో ప్రాజెక్టులు కట్టొచ్చు.
♦ ముంబై – అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఖర్చు రూ.1.1 లక్ష కోట్లు. సుమారు 100 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు పూర్తి చేయొచ్చు.
♦ ఒక ఇంటి ధర సుమారు రూ.50లక్షలు అనుకుంటే సుమారు 2కోట్ల మందికి ఇళ్లు ఇవ్వొచ్చు. ఏపీ, తెలంగాణలో దాదాపు ఇళ్లు లేని కుటుంబం ఉండదు.
♦ 10 కోట్ల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఇవ్వొచ్చు.
♦ ఒక్కో మహిళకు రూ.50000 ఇస్తే 20 కోట్ల మందికి ఇవ్వొచ్చు.