Starlink Services In India: ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ కు మన దేశంలో సర్వీసులు అందించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. టెలీ కమ్యూనికేషన్స్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా రీసెంట్ గానే స్టార్ లింక్ కంపెనీ భారత్ లో ఎంట్రీ ఇవ్వబోతోందని అన్నారు. అందుకు తగినట్లే ఇప్పుడు అనుమతి జారీ అయ్యింది.
అయితే ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు.. ఇండియా, మస్క్.. ఇద్దరూ కలిసి ఇస్తున్న షాక్ గా చూడాలి. ఈ మధ్యనే ట్రంప్ ఆపిల్ కంపెనీ ఓనర్ కు భారత్ లో వ్యాపారం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలోనే బిజినెస్ ను విస్తరించాలని చెప్పారు. అయితే, ట్రంప్ మాటలను ఆపిల్ ఓనర్ టిమ్ కుక్ అస్సలు కేర్ చెయ్యలేదు. తాజాగా అమెరికాలో ట్రంప్ ని ఇంపీచ్ చేయాలంటూ ఎలాన్ మస్క్ డిమాండ్ చేస్తున్నారు.
నిన్న మొన్నటి దాకా ట్రంప్ తో దోస్తీ చేసిన మస్క్.. ఇప్పుడాయనకు వ్యతిరేకంగా మారారు. దానికి తగినట్లే ఎలాన్ మస్క్ ఇప్పుడు ఇండియాలో తన వ్యాపారాన్ని తీసుకురావడం ద్వారా భారత్ కు తాను దగ్గరగానే ఉన్న విషయాన్ని చెప్పారు. ఇది వ్యాపారం విషయమే అయినా స్టార్ లింక్ ఇండియాలో ఎంట్రీ ఇస్తున్న టైమింగ్ కూడా చూడాలి.
స్టార్ లింక్ భారత్ లో సర్వీసులు అందిస్తే మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆ వివరాల్లోకి వెళితే.. జనరల్ గా ఫోన్ కాల్స్ లో తరుచూ జరిగే కాల్ డ్రాపింగ్స్ ఉండవు. అలాగే నెట్ వర్క్ డ్రాప్ అవడం, కట్ అవడం వంటి సమస్యలు ఉండవు. అలానే దాదాపు 100శాతం కచ్చితమైన సమాచారం, నావిగేషన్ సిస్టమ్ కూడా శాటిలైట్ ఇంటర్నెట్ ద్వారా సాధ్యపడుతుంది.
Also Read: హాట్ కేక్‌లా మారిన మారుతీ కారు.. బీభత్సంగా కొంటున్న జనం.. 36 నెలల్లో ఏకంగా..
ఇప్పుడు స్టార్ లింక్ కు కేంద్రం ఇచ్చిన అనుమతి టెస్ట్ ట్రయల్ కు సరిపోతుంది. ఈ ట్రయల్ పీరియడ్ లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులు ఎలా పని చేస్తాయో తెలుస్తుంది. స్టార్ లింక్ కు శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల రంగంలో అపారమైన అనుభవం ఉంది. గత ఆరేళ్ల నుంచి 8వేల శాటిలైట్లను ఇలా బ్రాండ్ బాండ్ ఇంటర్నెట్ కోసమని నింగిలోకి పంపింది. ఇప్పటికే ఈ రంగంలో అనుమతి పొందిన రిలయన్స్ జియో కానీ, వన్ వెబ్ కానీ ఇంతవరకు సర్వీసులు ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలోనే కొత్తగా మస్క్ కంపెనీకి అనుమతి దక్కడంతో తొందరలోనే సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
* భారత్ లో స్టార్ లింక్ శాటిలైట్ కంపెనీకి గ్రీన్ సిగ్నల్
* శాట్ కామ్ ఇంటర్నెట్ సర్వీసుల స్పెక్ట్రమ్ కి ఓకే
* దేశంలో మూడో శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీగా స్టార్ లింక్
* అప్లయ్ చేసిన 20 రోజుల్లోనే లైసెన్స్ జారీ