Maruti Suzuki: హాట్ కేక్‌లా మారిన మారుతీ కారు.. బీభత్సంగా కొంటున్న జనం.. 36 నెలల్లో ఏకంగా..
ALLGRIP SELECT 4x4 సిస్టమ్ వంటి ఫీచర్లు, పనితీరు ఈ మోడల్ కు మరింత ఆకర్షణ తెచ్చాయి.

Maruti Suzuki: మారుతీ సుజుకి నుంచి గ్రాండ్ విటారా హాట్ కేక్ లా మారింది. జనం దీన్ని బీభత్సంగా కొంటున్నారు. కేవలం 32 నెలల్లో 3 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో మారుతి సుజుకి నుండి వచ్చిన ఈ SUV షార్ట్ టైమ్ లోనే స్టాండ్ ఔట్ పెర్ఫార్మర్ గా మారింది. దేశ SUV మార్కెట్‌లో బ్రాండ్ స్థానాన్ని బలోపేతం చేసింది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా మిడ్-సైజ్ SUV విభాగంలో దూసుకుపోతోంది. కేవలం 32 నెలల్లో 3 లక్షల యూనిట్ల అమ్మకాలను సాధించిన అత్యంత వేగవంతమైన మోడల్‌గా అవతరించింది. ఈ మైలురాయి మారుతి సుజుకికి ఒక ముఖ్యమైన విజయం. SUV రంగంలో తన స్థానాన్ని మరింత పదిలం చేసింది.
ఈ విజయం వెనుక ఉన్న ప్రధాన కారణం గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లకున్న ప్రజాదరణ. ఇది FY24-25లో 43% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ALLGRIP SELECT 4×4 సిస్టమ్ వంటి ఫీచర్లు, పనితీరు ఈ మోడల్ కు మరింత ఆకర్షణ తెచ్చాయి.
ఈ విజయంపై MSIL మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ స్పందించారు. కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు. “మారుతి సుజుకిపై నమ్మకం ఉంచినందుకు మా 3 లక్షల మంది గ్రాండ్ విటారా కుటుంబానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గ్రాండ్ విటారా మిడ్-SUV మార్కెట్లో మా స్థానాన్ని బలోపేతం చేయడంలో కీలకంగా ఉంది. ప్రత్యేక డిజైన్, సేఫ్టీ ఫీచర్స్, అధునాతన సాంకేతికత పరిజ్ఞానంతో భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది” అని ఆయన తెలిపారు.
Also Read: బ్యాంక్ మేనేజర్ ఘరానా మోసం.. కస్టమర్ల డబ్బు 4 కోట్లు కొట్టేసిన వైనం.. ఎలా చీట్ చేసిందో తెలిస్తే..
2025 గ్రాండ్ విటారాలో కొత్త ఫీచర్లు తెచ్చారు. జీటా ఆల్ఫా వేరియంట్లలో ఆప్షనల్ పనోరమిక్ సన్‌రూఫ్ లు తెచ్చారు. R17 అల్లాయ్ వీల్స్, 360 కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ డాక్, క్లారియన్ సౌండ్ సిస్టమ్ వంటి అప్‌గ్రేడ్‌లు తీసుకొచ్చారు. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, అన్ని సీట్లపై 3-పాయింట్ సీట్ బెల్టులు, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో ESP, EBDతో ABS, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్ ఏర్పాటు చేశారు. వీటిలో సేఫ్టీకి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చారు.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా మల్టిపుల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో వస్తుంది:
1.5-లీటర్ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్
1.5-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్
డ్యూయల్ VVT ఇంజిన్ స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ
ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వేరియంట్
e-CVT
115.56bhp, 122Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
K-సిరీస్ ఇంజిన్ 103bhp, 136.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది.
గ్రాండ్ విటారా CNG 1.5-లీటర్ K-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్-VVT పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 87bhp, 121.5Nm పీక్ టార్క్‌ను అందిస్తుంది.
ముఖ్యంగా, K-సిరీస్ ఇంజిన్ సుజుకి ALLGRIP వ్యవస్థతో కూడిన ఫోర్-వీల్ డ్రైవ్ ఆఫర్ చేస్తుంది. ఆటో, స్పోర్ట్, స్నో, లాక్ డ్రైవ్ మోడ్‌లు ఉంటాయి.
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ మే 2025లో మొత్తం అమ్మకాలు 180,077 యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 174,551 యూనిట్ల కంటే 3.2% వృద్ధిని చూపిస్తుంది. ఈ గ్రోత్ కు ప్రధాన కారణం ఎక్స్ పోర్ట్స్ లో పెరుగుదలే. ఇది మే 2024లో 17,367 యూనిట్ల నుండి 79.8% పెరిగి 31,219 యూనిట్లకు చేరుకుంది.