మహారాష్ట్ర గడ్చిరోలి సవేగామ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.
మహారాష్ట్రలోని గడ్చిరోలి సవేగామ్ అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అటవీ ప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో 8మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. ఇది మావోయిస్టు దళానికి గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. మృతుల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ రాష్ట్రానికి చెందిన వారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
మావోల కదలికల గురించి సమాచారం అందుకున్న బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. సవేగామ్ అటవీప్రాంతంలో మావోల కోసం జల్లడ పడుతున్నారు. మావోలు ప్రతీకార దాడులకు దిగొచ్చనే సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లా సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతను కట్టుదిట్టం చేశారు. గడ్చిరోలి జిల్లాలో బోరియా అటవీ ప్రాంతంలో 2018 ఏప్రిల్‌లో కూడా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 41మంది మావోలు మృతి చెందారు.