లాక్ డౌన్ ఇంకా పొడిగిస్తారనేది అబద్ధం.. కేంద్రం

  • Publish Date - March 30, 2020 / 05:42 AM IST

కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా ఉండేందుకు  మనకోసం పోలీస్ అధికారులు ఎన్నో కష్టాలు పడుతున్నారు కానీ మనం ఏ మాత్రం పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాం. ఇదిలా ఉంటే లాక్ డౌన్ ఇంకొన్ని రోజులు పొడిగిస్తున్నారని అందరూ అనుకుంటున్న విషయం తప్పు  అని కేంద్ర కేబినెట్ కార్యదర్శిని రాజీవ్ గౌబా స్పష్టం చేశారు. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ పొడిగిస్తారన్న విషయంలో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు.

అవన్నీ పుకార్లని ఎవరి మాటలు నమ్మదని ఆయన తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  రోజురోజుకి పెరిగిపోతున్నాయి.  ప్రస్తుతం 1024కు చేరింది. 901మంది ఐసోలేషన్ వార్డులో  ట్రీట్మెంట్ పొందుతున్నారు. 27మంది మృతి చెందారు. 

ఇప్పటికైనా లాక్ డౌన్ విషయం లో నిర్లక్ష్యం చేయదని. అందరూ జాగ్రత్తగా ఎవరింట్లో వారు ఉండాలని తెలిపారు కేంద్ర కెబినెట్ రాజీవ్ గౌబా.