Farmer Crocodile : ఇంత ధైర్యమా..! పొలంలో మొసలి.. భుజాన వేసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన రైతు.. వీడియో వైరల్..

Farmer Carries Crocodile On Shoulder : బిహార్‌లో ఓ రైతు చూపిన ధైర్యసాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

Farmer Carries Crocodile On Shoulder

Farmer Carries Crocodile On Shoulder : బిహార్‌లో ఓ రైతు చూపిన ధైర్యసాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. వరి పొలంలోకి వచ్చిన ఐదు అడుగుల మొసలిని చాకచక్యంగా బంధించిన రైతు, దానిని ఏకంగా భుజాన మోసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా, అతడి సాహసాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అధికారులు అనంతరం మొసలిని సురక్షితంగా నదిలో విడిచిపెట్టారు.

Also Read : Arunachala Temple : అరుణాచలం వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. టైమింగ్స్!

బిహార్‌లోని సుపౌల్ జిల్లాలో ఓ వరి పొలంలో రైతులు పనులు చేస్తుండగా అకస్మాత్తుగా మొసలి కనిపించింది. దీంతో వారు తొలుత భయాందోళనకు గురయ్యారు. దానిని బంధించేందుకు ప్రయత్నించారు. అయితే, మొసలికి హాని చేయకుండా దానిని సురక్షితంగా పట్టుకోవాలని నిర్ణయించిన రైతులు, స్థానిక రైతు అమిత్ కుమార్ సహాయంతో చాకచక్యంగా దానిని అదుపులోకి తీసుకొచ్చారు. మొసలి ఎవరిపైనా దాడి చేయకుండా ముందుగా దాని నోరును తాళ్లతో బిగించి కట్టారు.

ఆ తరువాత దానిని వాహనంలో తరలించేందుకు చూడగా.. అందుబాటులో సరియైన వాహనం లేకపోవటంతో రైతు అమిత్ కుమార్ దాదాపు ఐదు అడుగులు పొడవున్న మొసలిని తన భుజాలపై వేసుకొని.. మోసుకుంటూ నేరుగా సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు బయలుదేరాడు. దీంతో స్థానికులు ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్ లలో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి.

మొసలిని తన భుజాన మోసుకుని సమీపంలోని భీమ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు కాలినడకన వెళ్లాడు. మొసలిని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని మొసలిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దానిని సమీపంలోని కోసి నదిలో సురక్షితంగా విడిచిపెట్టారు. వర్షాకాలంలో నీటి మట్టం పెరగడంతో మొసలి పొలంలోకి వచ్చి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.