Stray Dogs
Female Dog: ముంబైలోని థానెలో వీధి కుక్క పట్ల అమానుషంగా ప్రవర్తించారు దుండగులు. వీధి కుక్కను తాడుతో కట్టి చెట్టుకు ఉరివేసి దారుణానికి పాల్పడ్డారు. యానిమల్ యాక్టివిస్టులు పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మార్చి 16న బయటికొచ్చిన ఘటన వివరాల ప్రకారం.. ఒక ఆడ వీధి కుక్క, దాని పిల్లను చెట్టుకు వేలాడదీసి ఉరివేశారు. మార్చి 16 సాయినాథ్ కాలనీ, ఉల్లాస్ నగర్ క్యాంప్ 5ఏరియాలో ఘటన జరిగింది.
యానిమల్ ఎన్జీవోగా పనిచేస్తున్న యాక్టివిస్ట్ శ్రుతి చుగ్‌కు ఫోన్ కాల్ రావడంతో స్పాట్ లోకి వెళ్లిచూశారు. అప్పటికే రెండు వీధి కుక్కలు చనిపోయినట్లు తెలిసింది. వాటి డెడ్ బాడీలను పోస్టు మార్టం నిమిత్తం హాస్పిటల్ కు పంపారని పోలీస్ ఆఫీసర్ చెప్పారు.
Read Also: కొడుకును బెదిరించిందని కుక్కను చంపేసిన పోలీస్
రిపోర్టులతో ఉల్లాస్ నగర్ లోని హిల్ లైన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇంత క్రూరంగా మూగజీవులను హతమార్చిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.
‘మేం సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాం. దగ్గర్లోని ప్రాంతాల్లో ఏమైనా సాక్ష్యాలు దొరుకుతాయని వెదుకుతున్నాం. దాంతో పాటుగా ఈ వీధి కుక్కలు స్థానికంగా ఎవరినైనా గాయపరిచాయా అనే అనుమానంతో చెక్ చేస్తున్నాం. ఒకవేళ అలా జరిగి ఉంటే ప్రతీకారం తీర్చుకోవడం కోసమే జంతువులను హతమార్చి ఉండొచ్చు’ అని పోలీస్ అధికారి తెలిపారు.