South Eastern Railway : సౌత్ ఈస్టర్న్ రైల్వేలో అప్రెంటీస్ ఖాళీల భర్తీ

ఎంపిక విధానం విషయానికి వస్తే దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి తుది ఎంపిక చేస్తారు.

South Eastern Railway : సౌత్ ఈస్టర్న్ రైల్వేలో పలు అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1785 అప్రెంటీస్ ఖాళీలను ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ధరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.

అభ్యర్ధుల అర్హత విషయానికి వస్తే అప్రెంటిస్ పోస్టులకు కనీసం వయస్సు 15 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయస్సు 24 సంవత్సరాలు ఉండాలి. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ సమాచారం, గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పదోతరగతి, ఇంటర్ చదివి ఉండాలి. ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం విషయానికి వస్తే దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించి తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. పరీక్ష ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుకు డిసెంబర్ 12, 2021 వరకు అవకాశం ఉంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://rrcser.co.inను సందర్శించాలి.

ట్రెండింగ్ వార్తలు