Kangana Ranaut : ‘జెన్ జెడ్ రీల్స్’ వికారం, వాంతి వచ్చేలా ఉన్నాయి.. కంగనా రనౌత్‌ సంచలన కామెంట్స్!

Kangana Ranaut : జెన్ జెడ్ ఇన్ స్టా రీల్స్ అత్యంత అసహ్యకరంగానూ వాంతి, వికారం తెప్పించేలా ఉన్నాయని బీజేపీ ఎంపీ కంగనా రౌనత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Kangana Ranaut

  • సీజేపీ నిరసనల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అసహ్యంగా ఉన్నాయి
  • నిరసనకారుల అసభ్యకరమైన భాష, ప్రవర్తనపై కంగనా విమర్శలు
  • ఈ రీల్స్ తనకు చాలా బాధ కలిగించాయంటూ ఆవేదన

Kangana Ranaut : నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన నిరసనలకు సంబంధించి సోషల్ మీడియాలో రీల్స్‌ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జెన్ జెడ్ ఇన్ స్టా రీల్స్‌పై తాజాగా నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ సంచలన కామెంట్స్ చేశారు.

జెన్ జెడ్ రీల్స్ చాలా అసహ్యంగా ఉన్నాయని, చూస్తుంటేనే తనకు వాంతి వచ్చేలా ఉందని ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించారు. ఆయా రీల్స్‌లో నిరసనకారుల మాట్లాడే భాష, వారి ప్రవర్తన తనకు ఎంతో బాధించిందని కంగనా అన్నారు.

ఆమె ఇన్‌స్టా స్టోరీ ప్రకారం.. ‘వారు మాట్లాడుతున్న తీరు, వాడుతున్న భాష చూస్తుంటే నా జీవితంలో ప్రతి ఫ్రేమ్‌లో ఇంతటి వివాదాస్పదమైన, అసభ్యకరమైన విషయాలను ఒకేచోట ఎప్పుడూ చూడలేదు. ఛీ, వీళ్లు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు.

Read Also : Anti-Paper Leak Bill : లోక్‌సభ మంగళవారానికి వాయిదా.. యాంటీ-పేపర్ లీక్ బిల్లుపై మళ్లీ వేడెక్కనున్న చర్చ!

వీరి తల్లిదండ్రులు ఎవరు? వీరిని ఎలా పెంచారు?’ అంటూ కంగనా అసహనం వ్యక్తం చేశారు. భారత్ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, హుందాతనానికి ప్రతీకగల దేశం.. అలాంటి దేశంలో ఇలాంటి ప్రవర్తన దేశ విలువలకు విరుద్ధంగా ఉందని ఆమె విమర్శించారు.

కాక్రోచ్ అని పేరు పెట్టుకున్న మీరు కూడా అలానే కనిపిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. ఈ రెండింటిలో పెద్దగా ఏం తేడా లేదన్నారు. మీరు కేవలం చెత్తను, అసహ్యాన్ని ప్రపంచానికి చూపిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

నిజంగా ఈ రీల్స్ తనను బాధించాయన్నారు. ఈ జెన్ జెడ్ వీడియోలు చూశాక కొంతకాలం వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటే బెటర్ అనిపించిందని ఎంపీ కంగనా అన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.