Finance Ministry: క్లాసిఫైడ్ డేటాను ఇతర దేశాలకు ఇస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉద్యోగి అరెస్ట్

రహస్యంగా ఉంచాల్సిన క్లాసిఫైడ్ డేటాను ఇతర దేశాలతో రహస్యంగా పంచుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. డబ్బు ఆశకు గూఢచారిగా మారిన ఆ ఉద్యోగి, కొంత కాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డేటాను విదేశాలకు పంపిస్తున్నట్లు తెలియడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు

Finance Ministry: రహస్యంగా ఉంచాల్సిన క్లాసిఫైడ్ డేటాను ఇతర దేశాలతో రహస్యంగా పంచుకుంటున్న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. డబ్బు ఆశకు గూఢచారిగా మారిన ఆ ఉద్యోగి, కొంత కాలంగా ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డేటాను విదేశాలకు పంపిస్తున్నట్లు తెలియడంతో వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నిందితుడిని సుమిత్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఫోన్ ద్వారా ఇతర దేశాలకు పంపిస్తున్నట్లు కనుగొన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నాడట. అతనిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. పీఎస్ క్రైమ్ బ్రాంచ్‌లో అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేశారు.

UP: యూపీలో ముస్లిం సమాజం ఎస్పీ నుంచి బీఎస్పీ వైపుకు వెళ్తోందా?

ట్రెండింగ్ వార్తలు