అప్పుడు కాలేజీ బస్ డ్రైవర్..ఇప్పుడు కరోనా అంబులెన్స్ డ్రైవర్

  • Publish Date - August 7, 2020 / 04:13 PM IST

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి జీవితాలు కరోనాకు ముందు కరోనాకు తరువాత అన్నట్లుగా ఉన్నాయి. కోట్లాదిమంది ఉపాధులు..ఉద్యోగాలు ఊడిపోయాయి. ఆర్థిక సంక్షోభంలో గ్రాడ్యుయేట్లు కూడా కరోనా మృతదేహాలను తరలిస్తూ..వాటికి అంత్యక్రియలు చేస్తూ వస్తున్న కొద్దిపాటి డబ్బుతో బతకాల్సి వస్తున్న ఘోర దుస్థితి నెలకొంది.



లాక్ డౌన్ లతో విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో వాటిపై జీవించేవారంతా వీధిపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎవరికి దొరికిన పని వారు చేసుకుని బతాకాల్సి వస్తోంది. అది చిన్న పనా? పెద్ద పనా? అనికాదు ముఖ్యం..నాలుగు రూపాయలు చేతికి వస్తే చాలు కుటుంబాలు గడుపుకోవచ్చు అన్నట్లు రోజులు నెట్టుకొస్తున్నారు. అటువంటిదే దీపా జోసెఫ్ అనే మహిళ పరిస్థితి కూడా.

కేరళలోని కోజికోడ్‌కు చెందిన దీప ఓ మహిళ ఓ కాలేజీ బస్సు డ్రైవర్ గా పనిచేసేది. కానీ కరోనా కాటుతో కాలేజీలు మూతపడటంతో అంబులెన్స్‌ డ్రైవర్‌గా మారింది. తను పనిచేసే కాలేజీ మూత పడటంతో దీప ఉపాధి కోల్పోయింది. ఇల్లు గడవడం కష్టంగా మారింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అంబులెన్స్‌ డ్రైవర్‌గా మారింది.



దీనిపై దీప మాట్లాడుతూ..మా ఇంట్లో నేను, నా భర్త, మా అమ్మతో పాటు 10 క్లాస్ చదువుతున్న నా కొడుకుతో పాటు 8 క్లాస్ తరగతి చదువుతున్న నా కూతురు ఉంటున్నాం. వీరందరిని పోషించాలంటే ఏదో ఒక పని చేయాలి. అందుకే అంబులెన్స్‌ డ్రైవర్‌గా మారాను.’ అని దీప తెలిపింది. నా భర్తకు వచ్చే సంపాదన సరిపోకపోవటంతో తాను కూడా డ్రైవర్ గా పనిచేస్తున్నానని తెలిపింది. కరోనా కల్లోలం సృష్టిస్తున్న క్రమంలో తాను తరలించే అంబులెన్స్ లో పేషెంట్లను చూస్తుంటే బాధ వేస్తోందనీ..కానీ అదే సమయంలో తాను కూడా భయపడాల్సి వస్తోందనీ..తనకు కూడా మహమ్మారి సోకితే నా కుటుంబం పరిస్థితి ఏమిటాని ఆందోళన కలుగుతోందని కానీ ఈ పనిచేయక తప్పనిసరి పరిస్థితుల్తో నా కుటుంబం ఉందని వాపోతోంది.