ఘోర అగ్నిప్రమాదం: ఐదుగురు కార్మికులు సజీవ దహనం

  • Publish Date - May 9, 2019 / 04:02 AM IST

మహారాష్ట్రలోని పుణె జిల్లా ఉరులీ దేవాచిలో అగ్నిప్రమాదం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవ దహనమైపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఉరులీ దేవాచీలోని ఓ బట్టల దుకాణంలో గురువారం (మే9)తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసారు. ఈ ఘటనలో గాయపడినవారిని స్థానికుల సహాయంతో  పోలీసులు  స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని..అగ్రిప్రమాదం  షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.