Puri Jaynagar Express: రైలులో అగ్ని ప్రమాదం.. మరింత స్పీడు పెంచిన లోకో పైలట్.. తర్వాత ఏం జరిగిందంటే?

ఆ సమయంలో రైలులో దాదాపు 1300 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మరోవైపు, సమాచారం అందుకున్న రైల్వే ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు

Puri Jaynagar Express: బీహార్ లో భారీ రైలు ప్రమాదమే చోటు చేసుకుంది. దాదాపు 1300 మంది ప్రయాణికులతో వెళ్తున్న పూరీ జయనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఓవర్ హెడ్ వైర్‌లో మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రమాదంలో ఏమైనా ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును నిలిపివేయగానే, రైలు బోగీల నుంచి దూకి ప్రయాణికులు పరుగులు తీశారు.

ఢిల్లీ-హౌరా రైలు మార్గంలో ఈ ఘటన
సమాచారం ప్రకారం.. ఈ ఘటన బీహార్‌లోని జముయ్ ప్రాంతానికి చెందినది. పూరీ జయనగర్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ఢిల్లీ-హౌరా రైలు మార్గంలో వెళుతోంది. ట్రాక్ ఓవర్ హెడ్ వైర్ లో మంటలు చెలరేగాయి. ఇంతలో పైలట్ 18 బోగీలతో ఉన్న రైలును ఆపకుండా అతివేగంతో మంటల్లోంచి బయటకు తీశాడు. అనంతరం రైలును కొంతదూరం ముందు నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు రైలు ఆగిన వెంటనే భయాందోళనకు గురయ్యారు.

రైలులో 13 వందల మంది ప్రయాణికులు
ఆ సమయంలో రైలులో దాదాపు 1300 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. మరోవైపు, సమాచారం అందుకున్న రైల్వే ఉద్యోగులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణమేంటనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు