SCB Hospital fire : ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. 10మంది రోగులు మృతి.. పలువురికి తీవ్రగాయాలు

SCB Hospital fire : ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కటక్ నగరంలోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలోని ట్రామా కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో సోమవారం తెల్లవారు జామున అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది.

SCB Hospital fire

SCB Hospital fire : ఎస్‌సీబీ వైద్య కళాశాల ఆస్పత్రి ట్రామా కేర్ ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10మంది రోగులు మృతి చెందారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read : Moinabad Farm House Case: డ్రగ్స్ కేసు.. మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్

ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కటక్ నగరంలోని ఎస్‌సీబీ (SCB) మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రిలోని ట్రామా కేర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ (ICU) లో సోమవారం తెల్లవారు జామున అగ్నిప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి ట్రామా కేర్ ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 10మంది రోగులు మృతి చెందారు. వీరిలో ఏడుగురు ఐసీయూ లోపల మరణించగా.. మరో ముగ్గురు సహాయక చర్య సమయంలో ఇతర వార్డులకు తరలిస్తుండగా మరణించారు. 11మందికి గాయాలయ్యాయి. వారికి చికిత్స అందిస్తున్నారు.

అగ్నిప్రమాద ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన స్థలికి చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారంను సీఎం మోహన్ చరణ్ మాఝీ ప్రకటించారు. అగ్నిప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు.