ఘోరం : ఒకే కుటుంబంలోని ఐదుగురు మృతి

  • Publish Date - November 17, 2019 / 07:58 AM IST

మధ్యప్రదేశ్ లోని బార్వానీ జిల్లా మండ్వాడా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం (నవంబర్ 17)న జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు చనిపోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఖర్గోన్ జిల్లాలోని కాస్రావాడ్ కు ఓ వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తున్న కుటుంబం కారులో వెళ్తుండగా..ఎదురుగా వస్తున్న ట్రక్కు కారును బలంగా  ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు  అయిపోయింది. ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో బాలిక తీవ్రంగా గాయపడింది. 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే కారులో చిక్కుకుని తీవ్రంగా గాయడిన బాలికను బైటకు తీసి సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. అనంతరం కారులో చిక్కుకుని మృతి చెందినవారి మృతదేహాలను క్రేన్ సహాయంతో బైటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.