ఐదు రూపాయల డాక్టర్ ఇకలేరు

  • Publish Date - August 17, 2020 / 07:50 AM IST

ఐదు రూపాయలకే వైద్యం అందించి పేదలకు పెన్నిదిగా నిలిచిన డాక్టర్ తిరువేంగడం. ఐదు రూపాయల డాక్టర్‌గా చెన్నై వాసులకు చిరపరిచితుడైన తిరువేంగడం(70) శనివారం గుండెపోటుతో చనిపోయారు. ఉత్తర చెన్నై పరిధిలోని వ్యాసార్పాడి ఎరుకంచ్చేరి వి కళ్యాణపురంలో దాదాపు 45 ఏళ్లపాటు ఆయన ఐదు రూపాయలకే సేవలు అందించారు.



తొలుత రెండు రూపాయల తీసుకునే ఆయన రోగుల ఒత్తిడి మేరకు ఫీజును 5 రూపాయలు చేశారు. ఆ మొత్తాన్ని కూడా మందులు కొనుగోలు చేసుకోలేని స్థితిలో ఉన్న పేదల కోసం ఆయన ఖర్చు చేస్తుంటారు. కేన్సర్‌తో బాధపడుతున్న పేద రోగులకు కూడా తిరువేంగడం సేవలు అందించారు.



70 ఏళ్ల తిరువంకటం అనారోగ్యంతో దక్షిణ రైల్వే ఆసుపత్రిలో చేరగా ఆగస్టు 15వ తేదీన గుండెపోటు వచ్చి అర్ధరాత్రి మరణించారు. తిరువెంకడం మృతితో ఈ ప్రాంత ప్రజలలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయనకు భార్య సరస్వతి, కుమార్తె ప్రీతి, కుమారుడు దీపక్ ఉన్నారు.



తిరువంకటంను రోల్ మోడల్‌గా తీసుకుని ‘మెర్సెల్’ చిత్రంలో విజయ్ 5 రూపాయలకు డాక్టర్ పాత్రలో నటించాడని చెబుతుంటారు. డాక్టర్ తిరువంకటం మృతికి డిఎంకె నాయకుడు ఎంకె స్టాలిన్ సంతాపం తెలిపారు. తిరువంకటం మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.