Flydubai Hijacking: అవును.. విమానాన్ని కూల్చేయాలనుకున్నా.. ఫ్లైదుబాయ్ కో-పైలట్ సంచలన అంగీకారం.. విచారణలో షాకింగ్ నిజాలు!
ఫ్లైదుబాయ్ (Flydubai Hijacking)విమానాన్ని హైజాక్ చేసేందుకు యత్నించిన కేసులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- V Santhosh Kumar
- Published on- October 4, 2026 / 04:52 PM IST
Flydubai co-pilot Hamam Al Hammami has admitted to the hijack attempt
Flydubai Hijacking: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానాన్ని హైజాక్ చేసేందుకు యత్నించిన కేసులో సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్ర అనుమానాలు ఎదుర్కొంటున్న కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ విచారణలో తన నేరాన్ని అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. విమానాన్ని గాల్లోనే కూల్చివేసేందుకు పథకం ప్రకారం కెప్టెన్ స్మిత్ మచ్చర్ దృష్టి మరల్చి దాడి చేసినట్లు అతడు ఒప్పుకున్నాడు. ప్రాణభయం తనకు లేదని వ్యాఖ్యానించినప్పటికీ, ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరనేది మాత్రం అతడు ఇంకా వెల్లడించలేదు.
తీవ్రవాద కోణంలో దర్యాప్తు.. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు:
ఈ కుట్ర వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు లేదా ఇరాన్ ప్రమేయం ఉందా అనే కోణంలో ఇజ్రాయెల్, సౌదీ అరేబియాకు చెందిన ప్రత్యేక బృందాలు ముమ్మరంగా దర్యాప్తు చేపడుతున్నాయి. యూఏఈలో జన్మించిన హమ్మామీ తండ్రిది ఒమన్ కాగా, తల్లి సిరియాకు చెందిన మహిళ. ఫ్లైదుబాయ్(Flydubai Hijacking)లో చేరడానికి ముందు ఇతడు ఒమన్, సిరియా, మొరాకో దేశాలలో నివసించాడు. సిరియాలో సుదీర్ఘకాలం పాటు జరిగిన అంతర్యుద్ధం సమయంలో అక్కడే ఉండటంతో అతడు తీవ్రవాదం వైపు ఆకర్షితుడై ఉంటాడని భద్రతా అధికారులు గట్టిగా అనుమానిస్తున్నారు.
సోషల్ మీడియా పరిశీలన.. బయటపడిన తీవ్రవాద పోస్టులు:
కో-పైలట్ సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించిన అధికారులకు వేలాదిగా ఉగ్రవాద పూరిత సందేశాలు, పోస్టులు లభించినట్లు గుర్తించారు. అతనికున్న మత తీవ్రవాద ధోరణులే ఈ విమాన ప్రమాద కుట్రకు ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ అంతర్జాతీయ కుట్ర మూలాలను ఛేదించేందుకు దర్యాప్తు సంస్థలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి.
