Flyover Collapses
Flyover Collapse in Tamil nadu : తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ప్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూర్ జిల్లా అంబూర్ బస్టాండ్ సమీపంలో చెన్నై – బెంగళూరు నేషనల్ హైవేపై నిర్మిస్తున్న ప్లైఓవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్లైవర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 12 మంది కార్మికులను సురక్షితంగా కాపాడారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Also Read : రియల్ ఎస్టేట్ ఆదాయంపై హైడ్రా ఎఫెక్ట్..! అయినా తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..
జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అంబూరు నగర పరిధిలో హైలెవల్ ప్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఈ హైలెవల్ ప్లైఓవర్ నిర్మాణం పూర్తయితే అంబూరు ప్రాంతంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీ చాలా వరకు తగ్గుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్లైఓవర్ నిర్మాణం పనులు 60శాతం పూర్తయ్యాయి.