యాక్సిడెంట్‌లో నలుగురు హాకీ నేషనల్ ప్లేయర్ల మృతి

రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు జాతీయ స్థాయి హాకీ ప్లేయర్లు మృత్యువాత పడ్డారు. మరికొందరికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స తీసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

ధ్యాన్ చంద్ర ట్రోఫీలో ఆడేందుకు ఇతార్సి ప్రాంతం నుంచి హోషంగాబాద్ వెళ్తున్న హాకీ ప్లేయర్ల కార్ ప్రమాదానికి గురైంది. నేషనల్ హైవే 69 మీద రాయ్‌సాల్‌పూర్ గ్రామ సమీపంలో ప్రమాదం జరిగింది. మృతులను షెన్వాజ్ ఖాన్, ఆదర్శ్ హర్దువా, ఆశిశ్ లాల్, అనికేత్‌లుగా పోలీసులు గుర్తించారు. 

డ్రైవర్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.