attempted to raped
Boy Attempted To Raped : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఖంద్వా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల బాలుడిపై అత్యాచారయత్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిదేళ్ల బాలుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా మరో నలుగురు అక్కడికి వచ్చారు. బాలుడికి మాయ మాటలు చెప్పి ఓ గదిలోకి తీసుకెళ్లారు. ఇది గమనించిన స్థానికంగా ఉండే మరి కొంతమంది బాలురు దుకాణంలో ఉన్న సదరు బాలుడి తాతకు విషయం చెప్పారు.
ఆయన వెంటనే అక్కడికి వెళ్లి మనవడిని రక్షించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను రూమ్ లోకి వెళ్లే సరికే తన మనవడి దస్తులు విప్పేశారని, అత్యాచానికి యత్నిస్తుండగానే తాను అక్కడికి చేరుకున్నట్లు బాధితుడి తాత పోలీసులకు వివరించారు. బాలుడి తాత ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Judge Raped Minor Boy : మైనర్ బాలుడిపై అత్యాచారం చేసిన జడ్జి- పోక్సో కేసు నమోదు
బాలుడిపై అఘాయిత్యానికి ప్రయత్నించిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకడికి 18 సంవత్సరాల వయస్సు ఉండగా మరో ముగ్గురు 16 ఏళ్ల వయస్సు కలిగిన బాలురు కావడం గమనార్హం. ముగ్గురు మైనర్లను జువైనల్ కోర్టుకు తరలించారు.