దేశ వ్యాప్తంగా జరుగుతన్న లోక్ సభ ఎన్నికలు విడదలవారీగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు దశలు పూర్తికాగా నాలుగో దశ పోలింగ్ 71 నియోజకవర్గాల్లో జరగనున్న 928 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 210 మందిపై అంటే 23% శాతమంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఏప్రిల్ 24న ప్రకటించింది.
210 మందిలో 158 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ నివేదికలో వెల్లడించింది. 928 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను క్షుణ్ణంగా విశ్లేషించిన తరువాత ఏడీఆర్ ఈ విషయాన్ని వెల్లడిస్తున్నామని ఏడీఆర్ ప్రకటించింది. కాగా నాలుగో దశలో 943 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నప్పటికీ 15 మంది అభ్యర్థుల ప్రమాణపత్రాలు (సర్టిఫికెట్స్) సరిగా స్కాన్ కాలేదనీ…పూర్తి వివరాలు అందుబాటులో లేవనీ వాటిని అందుకే పూర్తిగా విశ్లేషించలేకపోయామని ఏడీఆర్ తెలిపింది.