Apoorva Mehta : అమెజాన్‌లో ఇంజనీర్ నుండి బిలియనీర్ వరకూ.. అపూర్వ మెహతా సక్సెస్ ఫుల్ స్టోరి

అమెజాన్‌లో సప్లై-చైన్ ఇంజనీర్‌గా పనిచేసిన అపూర్వ మెహతా ఈరోజు బిలియనీర్‌గా మారడం వెనుక కష్టాలున్నాయి. లక్ష్యాలున్నాయి. 'ఇన్‌స్టాకార్ట్‌' సీఈఓగా ఉన్న అపూర్వ మెహతా సక్సెస్ ఫుల్ స్టోరీ చదవండి.

Apoorva Mehta

Apoorva Mehta Success Story : అపూర్వ మెహతా అమెజాన్‌లో (Amazon) సప్లై-చైన్ ఇంజనీర్‌గా పని చేసేవారు. ఆ తర్వాత ‘ఇన్‌స్టాకార్ట్’ (Instacart) స్ధాపించి బిలియనీర్ అయ్యారు. ఆయన సక్సెస్ ఫుల్ స్టోరీ చదవండి.

2010లో అపూర్వ మెహతా సీటెల్‌లో నివసించేవారు. ఆ సమయంలో ఆయన అమెజాన్‌లో సప్లై-చైన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలని మెహతాకు ఆశయం ఉండేది. ఆ లక్ష్యంతోనే శాన్‌ఫ్రాన్సిస్కోకు మకాం మార్చారు. వ్యాపారం చేయాలనుకున్నారు సరే.. సరైన ఆలోచన అయితే లేదట.  లాయర్ల కోసం సోషల్ నెట్ వర్క్, గేమింగ్ పరిశ్రమలు, అడ్వర్టైజింగ్ స్టార్టప్‌లు ఇలా చాలా ఆలోచనలు చేసారు. చివరకు ‘ఇన్‌స్టాకార్ట్‌’ను 2012లో స్ధాపించారు.

కిరాణా సామాగ్రి తప్ప ఆన్‌లైన్‌లో ఏదైనా షాపింగ్ చేయగలనని గ్రహించినప్పుడు మెహతా ఇన్‌స్టాకార్ట్‌ను స్థాపించాడు. ఇన్‌స్టాకార్ట్ అనేది 7.7 మిలియన్ల వినియోగదారులతో, USలో 80,000 కంటే ఎక్కువ రిటైలర్‌ల నెట్‌వర్క్‌తో కిరాణా డెలివరీ కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఇది ప్రారంభించిన కొత్తలో మెహతానే స్వయంగా ఉబెర్ ద్వారా డెలివరీలు చేసాడట. అలా అతని వ్యాపారం విస్తరించింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో మెహతా వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందింది.

Carrier Success Tips : మీ చుట్టూ ఇలాంటి వారు ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు

మెహతా తల్లిదండ్రులు భారత్ నుండి లిబియాకు ఆ తరువాత కెనడాకు వలస వెళ్లినపుడు అనేక కష్టాలు పడ్డారట. చాలా త్యాగాలు చేసారట. తను తన సోదరుడు తమ కుటుంబం కన్న కలలను కొనసాగిస్తామని ఆయన సోషల్ మీడియాలో తన పోస్టులలో చెబుతుంటారు. ప్రతి విజయం వెనుక  చాలా కష్టాలు, బాధలు ఉంటాయి. మెహాతా ఈరోజు ఓ బిలియనీర్‌గా నిలబడటం వెనుక అతను, అతని కుటుంబం ఎదుర్కున్న కష్టాలు ఒక ఎత్తైతే అతని పట్టుదల అతనిని విజయపథం వైపు నడిపించింది.

Also Read: 17 ఏళ్లకు చదువుకు ఆపేశాడు.. 22 ఏళ్లకు మిలియనీర్ అయ్యాడు.. ఓ యువకుడి సక్సెస్‌ఫుల్ స్టోరి

ట్రెండింగ్ వార్తలు