KTR Over LG Medical College Rename: గాంధీ పేరును కూడా మోదీ అని మార్చేస్తారు.. మెడికల్ కాలేజీ పేరు మార్పుపై కేటీఆర్ సెటైర్

ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా పేరు మార్చాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) ప్రతిపాదించింది. ఏఎంసీ స్టాండింగ్ కమిటీ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. ఆ లోపే ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఏఎంసీ తొందరపడుతోంది.

KTR Over LG Medical College Rename: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‭లోని ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చబోతుండడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. మహాత్మ గాంధీ పేరును కూడా నరేంద్రమోదీగా మారుస్తారని, నోట్లపై గాంధీ బొమ్మల్ని తీసేసి మోదీ బొమ్మల్ని ముద్రిస్తారని దుయ్యబట్టారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలో పర్యటించారు. ఇందులో భాగంగా రేషన్ షాపులో మోదీ ఫొటో పెట్టకపోవడంపై కామారెడ్డి కలెక్టర్‭పై నిర్మల ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

కాగా, తాజా విషయంపై కేటీఆర్ స్పందిస్తూ ‘‘అహ్మదాబాద్‭లోని ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మారుస్తున్నారు. ఇప్పటికే సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియాన్ని నరేంద్ర మోదీ స్టేడియంగా మార్చారు. నిర్మల సీతారామన్ అయితే మరి కొద్ది రోజుల్లో కరెన్సీ నోట్లపై మహాత్మగాంధీ ఫొటో తీసేసి నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని ఆర్‭బీఐ ఆదేశాలిస్తారేమో’’ అంటూ ట్వీట్ చేశారు.

ఎల్జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా పేరు మార్చాలని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఏఎంసీ) ప్రతిపాదించింది. ఏఎంసీ స్టాండింగ్ కమిటీ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో.. ఆ లోపే ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఏఎంసీ తొందరపడుతోంది.

Lakhimpur Case: అక్కాచెల్లెళ్ల హత్యాచార కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేస్తూ సీఎం యోగి ఆదేశాలు

ట్రెండింగ్ వార్తలు